లక్నో: రాత్రి వేళ వాక్ చేస్తున్న ఒక టీచర్‌ను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఆయన కిందపడి చనిపోయినప్పటికీ దుండగులు అతడి తలపై కాల్చుతూనే ఉన్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Aligarh Teacher Shoot Dead) ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఏబీకే హైస్కూల్లో కంప్యూటర్ సైన్స్ టీచర్‌గా డానిష్ రావు 11 ఏళ్లుగా పని చేస్తున్నారు.
కాగా, డిసెంబర్ 24న రాత్రి వేళ తన సహోద్యోగులతో కలిసి డానిష్ రావు వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై అక్కడకు వచ్చారు. డానిష్ రావును అడ్డగించి ఆయనపై కాల్పులు జరిపారు. రోడ్డుపై నిర్జీవంగా పడి ఉన్న ఆయన తలపై ఒక వ్యక్తి గన్ ఉంచి కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. ‘నేను ఎవరో నీకు తెలియదా? ఇప్పుడు నీకు తెలుస్తుంది’ అని కాల్పులకు ముందు ఒక వ్యక్తి ఆయనతో అన్నాడు.
మరోవైపు టీచర్ డానిష్ రావును కాల్చి చంపిన తర్వాత ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఇది చూసి అక్కడున్న వారు భయాందోళనతో పరుగులు పెట్టారు. డానిష్ రావు హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో బుల్లెట్ గాయాలతో చనిపోయిన డానిష్ రావు తలపై ఒక నిందితుడు కాల్చుతూనే ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
अलीगढ़: AMU में शिक्षक को गोली मारने का वीडियो
➡हमलावर खड़े होकर शिक्षक को मारते रहे गोलियां
➡फायरिंग के समय मौके पर भगदड़ की स्थिति दिखी
➡एएमयू के ABK हाईस्कूल के शिक्षक थे मृतक दानिश
➡ABK हाई स्कूल में कंप्यूटर की शिक्षा देते थे शिक्षक
➡सिविल लाइन थाना इलाके के AMU… pic.twitter.com/uACjN55fAS— भारत समाचार | Bharat Samachar (@bstvlive) December 26, 2025
Also Read:
Protest Outside Delhi High Court | కుల్దీప్ సెంగర్‌కు బెయిల్‌పై.. ఢిల్లీ హైకోర్టు ముందు నిరసన