న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ యువతిపై అత్యాచారం కేసులో దోషి అయిన బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు విధించిన జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. (Protest Outside Delhi High Court) శుక్రవారం మహిళా సంఘాలకు చెందిన పలువురు మహిళలు ఢిల్లీ హైకోర్టు ముందు నిరసన తెలిపారు. కుల్దీప్ సింగ్ సెంగర్ జైలు శిక్షను నిలిపివేసి బెయిల్ మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు చేతపట్టిన మహిళలు ఈ మేరకు నినాదాలు చేశారు.
కాగా, ఢిల్లీ హైకోర్టు ముందు మహిళల నిరసనపై ఢిల్లీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం నిషేధమని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనకారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైక్ ద్వారా పోలీస్ అధికారి హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేయాలని నిరసనకారులను కోరారు.
#WATCH | People protest outside the Delhi High Court against their ruling of conditional bail to Unnao rape case convict Kuldeep Singh Sengar. pic.twitter.com/ie827rzAeT
— ANI (@ANI) December 26, 2025
#WATCH | Delhi | 2017 Unnao rape case | As people stage a protest outside the Delhi High Court against their ruling of conditional bail to convict Kuldeep Singh Sengar, the Police announce, “Demonstrating here is prohibited. It is illegal. Legal action may be taken against you.… pic.twitter.com/WnvboYkF7M
— ANI (@ANI) December 26, 2025
Also Read:
Unnao Rape Case | ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, తల్లి నిరసన.. లాక్కెళ్లిన పోలీసులు