లక్నో: విద్యార్థుల జంట రైలులో అసభ్యకర చేష్టలకు పాల్పడింది. ట్రైన్ డ్రైవర్ దీనిని రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ఆ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు. అతడితోపాటు ఆ జంటపై కూడా కేసు నమోదు చేశారు. (Students Obscene Acts On Train) ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 24న దుహై నుంచి మురాద్‌నగర్ మధ్య నడిచే నమో భారత్ రాపిడ్ రైలులో విద్యార్థి, విద్యార్థిని ప్రయాణించారు. సీట్లు ఖాళీగా ఉండటంతో అసభ్యకర, అశ్లీల చేష్టలకు పాల్పడ్డారు.
కాగా, ప్రీమియం కోచ్‌లోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ట్రైన్ డ్రైవర్ దీనిని గమనించాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను తన మొబైల్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో అతడు పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. దీంతో రైల్వే అధికారుల దృష్టికి ఇది వెళ్లింది.
మరోవైపు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ట్రైన్ ఆపరేటర్ రిషబ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. నమో భారత్ సర్వీస్ ప్రతిష్టను అతడు దెబ్బతీసినట్లు మురాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ట్రైన్ ఆపరేటర్‌తోపాటు పాటు రైలులో అశ్లీల చర్యలకు పాల్పడిన కాలేజీ జంటపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read:
Engineering Students Held Hostage | ఇంజినీరింగ్ విద్యార్థులను నిర్బంధించి.. డబ్బు దోపిడీ
Unnao Rape Case | ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, తల్లి నిరసన.. లాక్కెళ్లిన పోలీసులు