Couple Friendly OTT | ఓటీటీలోకి ‘కపుల్ ఫ్రెండ్లీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
CoupleFriendly | టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly).
Couple Friendly OTT | టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly). వాలంటైన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. ఈ చిత్రం మార్చి 13, 2026 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
కథ విషయానికి వస్తే.. నగర జీవితంలో ఉద్యోగాల కోసం పోరాడే యువత ఎదుర్కొనే సవాళ్లను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. శివ (సంతోష్ శోభన్) నెల్లూరు నుంచి చెన్నైకి వచ్చి ఇంటీరియర్ డిజైనర్‌గా స్థిరపడాలనుకునే యువకుడు. అవకాశాలు లేక బైక్ టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. మిత్ర (మానస వారణాసి) ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతి. అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరూ పరిచయం కావడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఒకే రూమ్‌లో ‘సహజీవనం’ (Live-in Relationship) చేయాల్సి రావడం ఈ కథలో ప్రధానాంశం. వీరి మధ్య చిగురించిన ప్రేమ, కెరీర్ పరంగా వచ్చే ఇగో సమస్యలు మరియు సమాజం నుండి ఎదురయ్యే సవాళ్లను దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ చాలా హృద్యంగా తెరకెక్కించారు. సంతోష్ శోభన్ తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, మానస వారణాసి తన గ్లామర్ మరియు అభినయంతో మెప్పించింది. ఈ సినిమాను చూసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

