తిరువనంతపురం: విడిగా నివసిస్తున్న భార్య కస్టడీకి పిల్లలను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Man kills children) కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పయ్యన్నూర్ గ్రామంలోని రామంతలికి చెందిన 36 ఏళ్ల కళాధరన్ భార్య నయనతార విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి విడిగా నివసిస్తున్న ఆమె ఇద్దరు పిల్లల సంరక్షణను తనకు అప్పగించాలని కోర్టును కోరింది.
కాగా, పిల్లల కస్టడీని నయనతారకు అప్పగించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. దీంతో పిల్లల స్వాధీనానికి ఆమె పోలీసుల సహాయం కోరారు. ఈ నేపథ్యంలో పిల్లలను భార్యకు అప్పగించాలని కళాధరన్కు పోలీసులు చెప్పారు. అయితే ఆరేళ్ల హిమ, రెండేళ్ల కన్నన్ను భార్యకు అప్పగించడానికి ఇష్టపడని కళాధరన్ మరునాడు దారుణానికి పాల్పడ్డాడు. డిసెంబర్ 22న రాత్రివేళ 56 ఏళ్ల తల్లి ఉషాతో కలిసి వారిని చంపాడు. పురుగుమందు కలిపిన పాలు పిల్లలకు తాగించగా వారు మరణించారు.
మరోవైపు కళాధరన్, అతడి తల్లి ఉషా కూడా పురుగుమందు కలిపిన పాలు తాగారు. ఇంట్లో సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక సూసైట్ నోట్‌ను డోర్ ముందు ఉంచారు. మంగళవారం ఉదయం ఆటో డ్రైవర్ అయిన కళాధరన్ తండ్రి ఇంటికి చేరుకున్న తర్వాత ఎవరూ ఎంతకీ డోర్ తెరువలేదు. అక్కడ ఉన్న సూసైడ్ నోట్‌ను గమనించిన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తలుపులు తొలగించి లోపలకు వెళ్లి చూశారు. కళాధరన్, అతడి తల్లి ఉషా, ఇద్దరు పిల్లల మృతదేహాలను కనుగొన్నారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: హాస్పిటల్ వార్డులో రోగి, డాక్టర్ మధ్య కోట్లాట, పిడిగుద్దులు.. వీడియో వైరల్
Watch: వీల్‌చైర్ అందుకున్న తర్వాత నడిచిన లబ్ధిదారుడు.. వీడియో వైరల్