లక్నో: ఒక తల్లి తన మూడేళ్ల కుమారుడికి పాలు ఇస్తున్నది. ఒక తోడేలు ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ మహిళ ఒడిలో ఉన్న బాలుడ్ని నోటకరుచుకుని ఎత్తుకెళ్లి చంపింది. చిద్రమైన ఆ బాలుడి మృతదేహాన్ని ఆ తర్వాత గుర్తించారు. (Wolf snatches boy from mother’s lap) తోడేళ్ల దాడులు కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున రసూల్పూర్ దారెహ్తా గ్రామానికి చెందిన రామ్ మనోహర్ భార్య నాన్కై తన మూడేళ్ల కుమారుడు అన్షుకు పాలు ఇస్తున్నది. ఒక తోడేలు మెల్లగా ఆ ఇంట్లోకి వచ్చింది. తల్లి ఒడిలో ఉన్న ఆ బాలుడ్ని నోటకరుచుకుని అక్కడి నుంచి పారిపోయింది. షాకైన ఆ మహిళ తోడేలు వెంట పడినప్పటికీ మంచు వల్ల అది ఎటు వెళ్లిందో అన్నది గుర్తించలేకపోయింది.
కాగా, ఆ బాలుడి కోసం గ్రామస్తులు వెతికారు. ఇంటికి కొంతదూరంలో చిద్రమైన అన్షు మృతదేహాన్ని గుర్తించారు. నరమాంస భక్షక తోడేలు గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో గత సెప్టెంబర్ నుంచి తోడేళ్ల దాడుల్లో 12 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు. మృతుల్లో పది మంది పిల్లలున్నారు.
Also Read:
Girl Kills Father With Lover | తండ్రికి నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడితో చంపించిన బాలిక
Watch: వీల్‌చైర్ అందుకున్న తర్వాత నడిచిన లబ్ధిదారుడు.. వీడియో వైరల్
Watch: హాస్పిటల్ వార్డులో రోగి, డాక్టర్ మధ్య కోట్లాట, పిడిగుద్దులు.. వీడియో వైరల్
Watch: మహిళను ఢీకొట్టిన ఆటో.. తర్వాత ఏం జరిగిందంటే?