హనుమకొండ చౌరస్తా, మార్చి 14: ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్లు ఏ. లోకేశ్, పీ. మమత అద్భుత ప్రతిభ కనబర్చారు.
ఈ నెల 11 నుంచి 14 వరకు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన పోటీల్లో భాగంగా నర్సంపేటకు చెందిన లోకేశ్ (ఎఫ్-46) జావెలిన్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో రెండు కాంస్యాలు సాధించాడు. మరోవైపు మమత (ఎఫ్-55) షాట్‌పుట్, జావెలిన్‌త్రో క్యాటగిరీల్లో రెండు కాంస్యాలు గెలిచింది.