Rukmini Vasanth | అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ భామ రుక్మిణి వసంత్. కాంతార 1తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాప్ స్టార్లతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. రుక్మిణి వసంత్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో యశ్ నటిస్తోన్న టాక్సిక్. ఇందులో మెల్లిసా పాత్రలో నటిస్తోంది రుక్మిణి వసంత్. కాగా ఈ బ్యూటీ టాక్సిక్ సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
తాజా కథనాల ప్రకారం రుక్మిణి వసంత్ ఏకంగా రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇటీవల కాలంలో రుక్మిణి వసంత్ అందుకున్న సక్సెస్‌లతో మార్కెట్లో డిమాండ్ పెరుగడంతో పేచెక్ కాస్తా అమాంతం పెంచేసిందని ఇన్సైడ్ టాక్. సౌతిండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న భామల్లో చేరిపోయిందనడంలో ఎలాంటి సందేఃహం లేదు. టాక్సిక్ ఆగస్టు 26న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. నయనతార, కియారా అద్వానీ, హుమాఖురేషి, తారా సుటారియా, రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
రుక్మిణి వసంత్ మరోవైపు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్‌లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మొత్తానికి కెరీర్లో స్టార్ యాక్టర్లతో కలిసి నటిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
Harish Rao | సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీశ్ రావు
Lok Sabha: లోక్‌సభలో 4 బిల్లులు.. సభ 2 గంటల వరకు వాయిదా
TN Assembly | తమిళనాడులో రాష్ట్ర గీతానికి పెద్దపీట.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం