Kazipet | కాజీపేటలో దారుణం..అక్రమ సంబంధం వద్దంటూ తల్లిని చంపిన తనయుడు
Kazipet | అక్రమ సంబంధం వద్దంటూ ఓ కన్న తల్లిని కొడుకు గొంతుకోసి దారుణంగా హత్య చేసిన సంఘటన కాజీపేట పట్టణం బాలాజీనగర్ లో గురువారం చోటు చేసుకుంది.
కాజీపేట : అక్రమ సంబంధం ( Illicit affair ) వద్దంటూ ఓ కన్న తల్లిని కొడుకు గొంతుకోసి దారుణంగా హత్య ( Murder ) చేసిన సంఘటన కాజీపేట ( Kazipet ) పట్టణం బాలాజీనగర్ లో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగుల సుధాకర్,ఉదయశ్రీ 20 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వీరితో పాటు సుధాకర్ తల్లి బాలాజీనగర్‌లో నివసిస్తున్నారు.
సుధాకర్ ప్రైవేట్ కంపెనీలో అటెండర్‌గా పనిచేస్తుండగా భార్య ఉదయశ్రీ ఇన్‌స్ట్రాగ్రామ్ లో రీల్స్ చేస్తు వస్తుంది. ఈ దశలో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. వీరిద్దరు వేరే కాపురం పెట్టుకునేందుకు ఆలోచిస్తున్న తరుణంలో ఉదయశ్రీ ఇంట్లో వాళ్లకు చెప్పి గురువారం బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది.
ఈ విషయం తెలుసుకున్న కుమారుడు దొరబాబు తల్లిని బెడ్రూంలోకి తీసుకెళ్లి అక్రమ సంబంధం వద్దంటూ నచ్చచెప్పేందుకు యత్నించాడు. అయితే తల్లి ససేమిరా అనడంతో కోపంతో ఆమె గొంతు కోసి చంపి పారిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సెంట్రల్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ శ్యాం సుందర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

