Brazil Coach : ఫిఫా వర్డ్‌కప్ వేళ టీవీలకు అర్ధ రాత్రిళ్లు మేల్కొని టీవీలకు అతుక్కున్న భారతీయులు స్వదేశంలో బ్రెజిల్ (Brazil)తో మ్యాచ్‌కోసం కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మాజీ ఛాంపియన్ అయిన ఈ దక్షిణ అమెరికా జట్టుతో ఫ్రెండ్లీ పోరు తమకు బోల్డెంత కిక్ ఇస్తుందని అనుకుంటున్నారు. విదేశీ స్టార్లను ప్రత్యక్షంగా చూసే రోజు సమీపిస్తుండగా బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలొట్టి (Carlo Ancelotti) సంచలన వ్యాఖ్యాలు చేశాడు. కోల్‌కతాలో అక్టోబర్ 3న జరుగనున్న మ్యాచ్‌ను ఉద్దేశించి గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత్‌లో ఫుట్‌బాల్ సంస్కృతి లేదని అన్నాడు. సాకర్‌లో మనదేశం వెనకబడడానికి గల కారణాలను, కొత్తతరం ఆటగాళ్ల కోసం కీలక సూచనలు చేశాడు.
భారత్, బ్రెజిల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్ 3వ తేదీన కోల్‌కతాలో ఇరుజట్లు ఫ్రెండ్లీగా తలపడనున్నాయి. ఈ బిగ్ మ్యాచ్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలొట్టి త్వరలోనే భారత్ రానున్నాడు. కోల్‌కతాను చూసేందుకు ఆతృతగా ఉన్నానని పేర్కొన్న కార్లో.. భారత్‌లో ఫుట్‌బాల్ సంస్కృతి లేదంటున్నాడు. బ్రిస్బేన్‌లో మీడియాతో మాట్లాడిన కార్లో బ్రెజిల్లో అంతులేనంతగా ఫుట్‌బాల్ సంస్కృతి ఉందని చెప్పాడు. కానీ, ప్రపంచ స్థాయి జట్లను ఎదుర్కొనేంత అనుభవం టీమిండియాకు లేదని ఆయన కుండబద్ధలు కొట్టేశాడు.
#Brazil head coach #CarloAncelotti said India has no football culture.https://t.co/jZwZ0eGoRp
— News9 (@News9Tweets) September 24, 2026
‘ఇతర దేశాలను.. వాటి ఆట సంస్కృతిని మనం చూడాలి. విభిన్నమైన స్టయిల్‌తో మనం ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడుతున్నాం. బ్రెజిల్‌తో మ్యాచ్ కోసం భారత జట్టు ఎదురు చూస్తోంది. కానీ, భారత్‌కు ప్రపంచస్థాయి జట్టును ఎదుర్కొనేంత అనుభవం లేదు. అయినా సరే మాతో టీమిండియా ఎలా ఆడుతుంది? అనేది ముఖ్యమైన విషయం. టీమిండియా అనుభవ రహితంగా ఉండడానికి కారణం ఫుట్‌బాల్ సంస్కృతి లేకపోవడమే. కానీ, ఆ దేశం మిగతా ఆటల్లో ఉత్తమంగా ఉంది. సాకర్‌లో భారత యువతరం రాణించాలంటే బలమైన వ్యవస్థ ఉండాలి. నేను ఇప్పటివరకూ భారత్ వెళ్లలేదు. త్వరలోనే కోల్‌కతాను చూసేందుకు ఆతృతగా ఉన్నా’ అని వెల్లడించాడు.
🚨India’s Press Conference: Khalid Jamil & Gurpreet Singh Sandhu
“We want to make sure that we get something out of these games” Gurpreet Singh Sandhu on India’s approach ahead of the Panama friendly@Rahul_01Giri @lalbabarice #IndianFootball #IndiavsPanama pic.twitter.com/vLZOLZCIfn
— RevSportz Global (@RevSportzGlobal) September 24, 2026
బ్రెజిల్ కోచ్ వ్యాఖ్యలను భారత కోచ్ ఖలీద్ జమిల్ చాలా తేలికగా తీసుకున్నాడు. ఫుట్‌బాల్ కల్చర్ లేదంటూ కార్లో చెప్పిన మాటలను తాను ఏమాత్రం పట్టించుకోనని జమిల్ స్పష్టం చేశాడు. ఫ్రెండ్లీ మ్యాచుల్లో భాగంగా సెప్టెంబర్ 25 నుంచి మూడు అంతర్జాతీయ జట్లను భారత్ ఢీకొట్టనుంది. బ్రెజిల్‌తో పాటు ఉరుగ్వే, పనామా టీమ్‌లతో మెన్ ఇన్ బ్లూ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు సారథ్యంలోని టీమిండియా తొలుత బెంగళూరులో పనామాతో, ఆపై కోల్‌కతాలో బ్రెజిల్, ఉరుగ్వేతో తలపడనుంది.