Boycott Sunrisers : ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్(Kavya Maran)పై నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. విదేశీ లీగే అయినప్పటికీ శత్రుదేశం ఆటగాడిని కొన్నందుకు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఫలితంగా బాయ్‌కాట్ సన్‌రైజర్స్(Boycott Sunrisers) హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్(Abrar Ahmed)ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనడమే దీనికంతటికి కారణం.
భారత ఫ్రాంచైజీలు పాకిస్థాన్ ఆటగాళ్లను కొనడం మానేసి చాలా రోజులైంది. ఐపీఎల్ ఆరంభంలో వసీం అక్రమ్, సొహైల్ తన్వీర్.. వంటి కొందరికి అవకాశాలిచ్చినా ఆ తర్వాత మాత్రం పాక్ ఆటగాళ్లకు నో ఎంట్రీ బోర్డు పెట్టింది బీసీసీఐ. అలాంటిది ఇప్పుడు సన్‌రైజర్స్ జట్టులో దాయాది మిస్టరీ స్పిన్నర్‌కు చోటు దక్కింది. గురువారం జరిగిన ది హండ్రెడ్ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ భారీ ధరకు కొన్నది.
Shame on Kavya Maran😡#TheHundredLeague #TheHundred pic.twitter.com/Ywm8hsdgmG
— Pathan Bhai (@PathanBhaiii) March 12, 2026
వేలంలో అబ్రార్‌ను లక్షా తొంభై వేల యూరోలకు £190,000 భారతీయ కరెన్సీలో రూ.2.34 కోట్లకు దక్కించుకుంది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కే అబ్రార్‌ను సన్‌రైజర్స్ జెర్సీల చూడాల్సి రావడం కొందరికి నచ్చడం లేదు. అందుకే.. సోషల్ మీడియా వేదికా కావ్య మారన్‌ను, ఆరెంజ్ ఆర్మీ టీమ్‌ను ట్రోల్స్ చేస్తున్నారు.
🚨 BCCI VICE PRESIDENT ” RAJIV SHUKLA ” ON KAVYA MARAN’S ABRAR AHMED DEAL 🚨
He said – 🗣️ “ It is not our domain , they did it for some foreign league ….. , They will have to take a call — We can’t do , it’s out of our hands ” 🤯
— Kiara (@crickiara) March 13, 2026
ఇదే అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajeev Shukla)ను సంప్రదించగా ‘మాకేం తెలియదు’ అని బదులిచ్చాడు. ‘ది హండ్రెడ్ లీగ్ అనేది భారత బోర్డు నిర్వహించే లీగ్ కాదు. విదేశీ ఆటగాళ్లకు సంబంధించిన లీగ్ అది. సో.. ఫ్రాంచైజీలు ఏ ఆటగాడినైనా కొనుక్కునేందుకు అవకాశముంది. ఈ విషయంలో మేము ఏం చేయలేం. చెప్పాలంటే మా చేతుల్లో ఏమీ లేదు’ అని శుక్లా సమాధానమిచ్చాడు.
Big Breaking 🚨
SunRisers Hyderabad became the most hated team of the IPL so far pic.twitter.com/AnChyzuYW3— Voice of Hindus (@Voiceofhindus) March 12, 2026
Fans are trolling Kavya maran for buying Pakistan player abrar ahemd in her team in IPL#BoycottSRH pic.twitter.com/iia8z4huGj
— KooL07 (@KooL077) March 13, 2026
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ విదేశీ లీగ్స్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్‌లోనూ ఇటీవలే ఆరెంజ్ ఆర్మీకి ఒక జట్టును కొన్నది. ఆ టీమ్ పేరు సన్‌రైజర్స్ లీడ్స్. తాజా వేలంలోపాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కావ్య మారన్ బృందం కొన్నది. తనను కొనుగోలు చేయడం పట్ల అబ్రార్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘నన్ను తీసుకున్నందుకు సన్‌రైజర్స్ లీడ్స్‌కు ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచినందుకు కావ్య మారన్‌కు కృతజ్ఞతలు. సన్‌రైజర్స్ జట్టు ఈ ఏడాది ది హండ్రెడ్ ట్రోఫీ గెలవడంలో నా వంతు పాత్ర పోషిస్తాను’ అని అబ్రార్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.