చెన్నై: వేగంగా వెళ్తున్న ఆటో ఒక మలుపు వద్ద మహిళను ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆ ఆటో అదుపుతప్పింది. రోడ్డుపై రెండుసార్లు పల్టీలు కొట్టింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Auto Flips After Hitting Woman) తమిళనాడులోని సేలంలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 21న ఉదయం వేళ కొందరు ప్రయాణికులతో ఆటో వేగంగా వెళ్తున్నది.
కాగా, ఇరుకైన రోడ్డులో ఒక మహిళ నడుస్తున్నది. వేగంగా వచ్చిన ఆటో మలుపు వద్ద ఆ మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె కిందపడిపోయింది. మహిళను ఢీకొట్టిన తర్వాత ఆటో కూడా అదుపుతప్పింది. అక్కడి రోడ్డుపై బోల్తాపడింది. రెండుసార్లు పల్టీలుకొట్టింది.
మరోవైపు ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు సహాయం కోసం ముందుకు వచ్చారు. కిండపడి గాయపడిన మహిళను పైకి లేపి సపర్యలు చేశారు. ఆటోలో ప్రయాణించిన వ్యక్తులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Salem 🚨⚠️
Disturbing Visuals 🚨
Narrow Road + Residential Area + #SpeedHump to Slow Down…
Auto Driver distracted, not paying attention, rammed pedestrian & toppled. @DriveSmart_IN @skr77s @reclaimchennai
VC @Paarivel_06
pic.twitter.com/oHVKUJR3Gq— Dave (Road Safety: City & Highways) (@motordave2) December 21, 2025
Also Read:
victory procession turns into blaze | విజయోత్సవ ఊరేగింపులో చెలరేగిన మంటలు.. 16 మందికి కాలిన గాయాలు
Watch: హోంగార్డ్ సెలక్షన్స్‌కు 8,000 మందికిపైగా హాజరు.. ఏకంగా రన్‌వేపై పరీక్ష