బెంగళూరు: కులాంతర వివాహం చేసుకున్నందుకు కుమార్తె, అత్తింటి కుటుంబంపై ఆమె తల్లిదండ్రులు, బంధువులు కక్షగట్టారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు అత్తింటి వారిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ సందర్భంగా గర్భిణీ కుమార్తెను ఆమె తండ్రి కొట్టి చంపాడు. ( Man Beats To Death Pregnant Daughter) కర్ణాటకలోని హుబ్బళ్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది మేలో 19 ఏళ్ల మాన్య తన కుటుంబానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకున్నది. కుటుంబం నుంచి ప్రాణ హాని ఉండటంతో కొన్ని నెలలు హవేరి జిల్లాలో ఆ జంట నివసించింది. డిసెంబర్ 8న హుబ్బళ్లి జిల్లాలోని సొంత గ్రామానికి వారు తిరిగి వచ్చారు.
కాగా, మాన్య ఆరు నెలల గర్భిణి. అయితే కులాంతర వివాహం చేసుకోవడంపై ఆమె కుటుంబం కక్షగట్టింది. ఆదివారం ఉదయం భర్త, మామ పొలంలో ఉండగా మాన్య తండ్రి ప్రకాష్, మరి కొందరు వారిపై దాడికి ప్రయత్నించారు. అయితే ఆమె భర్త, మామ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.
మరోవైపు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మాన్య తండ్రి ప్రకాష్, బంధువులు ఆమె అత్తమామల ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. గర్భిణీ అయిన మాన్యపై ఐరన్ రాడ్‌తో తండ్రి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మరణించింది.
అయితే మాన్యను రక్షించేందుకు అత్తమామలు రేణుకమ్మ, సుభాష్ ప్రయత్రించారు. వారిని కూడా దారుణంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మాన్య మృతదేమాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె తండ్రి ప్రకాష్, మరో ఇద్దరు బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దాడిలో పాల్గొన్న మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
School girl Blocks Road | స్కూల్ వ్యాన్ రాలేదని.. రోడ్డును దిగ్బంధించి విద్యార్థిని నిరసన
Watch: ఆటో డ్రైవర్‌ను కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Watch: హోంగార్డ్ సెలక్షన్స్‌కు 8,000 మందికిపైగా హాజరు.. ఏకంగా రన్‌వేపై పరీక్ష