రాయపోల్, మార్చి 04 : రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆద్యంతం సంబురంగా, సందడిగా శనివారం విద్యార్థులు స్వయం పరిపాలనలో పాల్గొన్నారు. సర్పంచ్ రేణుక రాజా గౌడ్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్య గొప్పదనాన్ని వివరించారు.
విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవాలని సర్పంచ్ రేణుక రాజా గౌడ్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కుటుంబ నేపథ్యం ఏదైనా, ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా.. పట్టుదలగా చదవాలని వారు తెలిపారు. ‘మీ భవిష్యత్తు మార్చేది విద్య మాత్రమే’ అని విద్యార్ధులకు చదువు ప్రాధాన్యాన్ని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేష్, సాజిత్, జీనాథ్, మాధురి, స్వప్న పాల్గొన్నారు.