Bab el-Mandeb | ప్రపంచానికి ఇరాన్ మరో షాక్.. బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిని కూడా మూసేస్తుందా..?
Bab el-Mandeb : హార్ముజ్ జలసంధి సమస్య తీరకముందే ఇరాన్ ప్రపంచానికి మరో షాకివ్వబోతున్నట్లు కనిపిస్తోంది. బాబ్ ఎల్ మాండెబ్ అనే మరో జలసంధిని కూడా ఇరాన్ మూసేస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
Bab el-Mandeb : ఇప్పటికే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం ద్వారా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలకు చమురు సహా ఆహారం, ఎరువులు, ఇతర ఉత్పత్తుల రవాణా ఆగిపోయింది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ జలసంధి సమస్య తీరకముందే ఇరాన్ ప్రపంచానికి మరో షాకివ్వబోతున్నట్లు కనిపిస్తోంది. బాబ్ ఎల్ మాండెబ్ అనే మరో జలసంధిని కూడా ఇరాన్ మూసేస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
దీనికి కారణం.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబఫ్ చేసిన ట్వీట్. ‘‘బాబ్ ఎల్ మాండెబ్ అనే జలసంధి ద్వారా ప్రపంచానికి ఎంత చమురు, ఎల్ఎన్జీ, గోధుమలు, బియ్యం, ఎరువులు వంటివి రవాణా అవుతుంటాయి..? ఏ దేశం, ఏ సంస్థ ఈ జలసంధి నుంచి ఎక్కువ రవాణా చేస్తుంటాయి’’ అని ప్రశ్నిస్తూ ఆయన ఒక ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇరాన్ ఈ జలసంధిపై కూడా దృష్టిపెట్టిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే హార్ముజ్ కారణంగా ప్రపంచం చమురు సంక్షోభంలో పడింది. ఇది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో ఆయిల్ దొరకడం లేదు. ఆహారోత్పత్తుల రవాణా ఆగిపోయింది. ఈ జలసంధి ఎప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందో తెలియదు. అలాంటిది ఇప్పుడు ఇంకో మార్గాన్ని కూడా ఇరాన్ మూసేస్తే ప్రపంచం మరింత ఇబ్బంది పడుతుంది.
What share of global oil, LNG, wheat, rice, and fertilizer shipments transits the Bab-el-Mandeb Strait?
Which countries and companies account for the highest transit volumes through the strait? 🤔
— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 3, 2026
ఆసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాలు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటాయి. ఇటు హార్ముజ్, అటు బాబ్ ఎల్ మాండెబ్ జలసంధులు ప్రపంచ నౌకా రవాణాకు ఎంతో కీలకం. ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ప్రపంచ వాణిజ్యంలో ఈ మార్గం వాటా 10-12 శాతం ఉంది. ప్రతి సంవత్సరం రూ.93.95 లక్షల కోట్ల విలువైన సరుకుల రవాణా ఈ జలసంధి నుంచే జరుగుతుంది. అలాంటిది యుద్ధం నేపథ్యంలో జలసంధిని మూసేస్తే ఈ మొత్తం వ్యాపారం స్తంభించడం ఖాయం. మరోవైపు ఇరాన్ యుద్ధాన్ని ఇంకా తీవ్రతరం చేస్తోంది. ఇరాన్ సైన్యం, తన అనుబంధ సైన్యం కలిసి వేవ్ 93 పేరుతో, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 ప్రారంభించాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

