ముంబై: స్థానిక సంస్థల ఎన్నికల విజయోత్సవ ఊరేగింపులో మంటలు చెలరేగాయి. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గెలిచిన అభ్యర్థులతో సహా పలువురికి కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. (victory procession turns into blaze) మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జెజురి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన ఎన్సీపీ కౌన్సిలర్లు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ఆశీర్వాదం కోసం ఖండోబా ఆలయానికి వెళ్లారు.
కాగా, ఆలయం ఉన్న కోట ముందు కొందరు మహిళలు సాంప్రదాయ జ్యోతులు వెలిగించారు. కోటపై ఉన్న కొందరు యువకులు స్ప్రేలతో పసుపు రంగులు చల్లారు. అయితే వెలుగుతున్న జ్యోతులపై ఆ రంగులు పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్నవారు భయాందోళన చెందడంతో గందరగోళం నెలకొన్నది.
మరోవైపు కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎన్సీపీ కౌన్సిలర్లు, మహిళలు, యువకులతో సహా సుమారు 16 మందికి కాలిన గాయాలయ్యాయి. చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వారిని తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలైన కొందరిని మెరుగైన చికిత్స కోసం పూణేలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
महाराष्ट्र के पुणे में स्थानीय निकाय चुनाव जीत के जश्न के दौरान हादसा।जेजुरी मंदिर के पास हल्दी-कुमकुम चढ़ाने के दौरान आग भड़कने से 5 से 9 लोग घायल, जिनमें जीतने वाले कुछ नगरसेवक भी शामिल।पुलिस के मुताबिक जलते दीये या पटाखों से आग लगने की आशंका।#Pune #jejuri #LocalBodyElections pic.twitter.com/dQJqboBOvk
— Visshal Singh (@VishooSingh) December 22, 2025
Also Read:
Watch: ఆటో డ్రైవర్‌ను కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Watch: హోంగార్డ్ సెలక్షన్స్‌కు 8,000 మందికిపైగా హాజరు.. ఏకంగా రన్‌వేపై పరీక్ష