CEC : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar)పై అభింసన తీర్మానం (Censure Motion) ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ‘సర్'(SIR), ‘ఓట్ చోరీ'(Vote Chori) విషయంలో అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షపార్టీలకు చెందిన 193 మంది ఎంపీలు నోటీసులో సంతకాలు చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఎగువ సభ లేదా దిగువ సభలో సీఈసీని తొలగించాలనే నోటీసు ఇవ్వాలని వీరంతా భావిస్తున్నారు.
సీఈసీని తొలగించాలనే డిమాండ్‌తో ఇండియా కూటమికి చెందిన 193 మంది ఎంపీలు రెండు సెట్లతో కూడిన నోటీసులపై సంతకాలు చేశారు. వీరిలో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు 130 మంది, రాజ్యసభకు చెందినవారు 63 మంది ఉన్నారు. అయితే.. ఏ సభలో సీఈసీపై నోటీసు ఇవ్వనున్నారు? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
STORY | 193 opposition MPs sign notice seeking motion for CEC’s removal
A total of 130 Lok Sabha MPs and 63 Rajya Sabha MPs have signed notices seeking the removal of Chief Election Commissioner Gyanesh Kumar, a source has said.
According to the source, the notice is likely to… pic.twitter.com/ooZUdWt44n
— Press Trust of India (@PTI_News) March 12, 2026
‘సీఈసీ అభింశసనకు సంబంధించిన నోటీసులో ఎంపీలు ఉత్సాహంగా సంతకాలు చేశారు. పలువురు నాయకులు సైతం నోటీసులో సంతకం చేసేందుకు ముందుకొచ్చారు. అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి అవసమైన సంఖ్యా బలం ఇప్పటికే దాటేశాం’ అని ప్రతిపక్ష ఎంపీ ఒకరు పీటీఐతో వెల్లడించారు.
నిబంధనల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను తొలగించడానికి లోక్ సభలో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టాలనుకుంటే కనీసం 100 మంది ఎంపీలు సంతకాలు చేయాలి. అదే రాజ్యసభలో 50 మంది సతంకాలు చాలు. శుక్రవారం ప్రతిపక్ష ఎంపీలు ఏదో ఒక సభలో నోటీసు ఇచ్చే అవకాశముంది. అదే జరిగితే స్వతంత్ర భారతంలో సీఈసీని తొలగించాలనే ప్రవేశపెట్టిన మొట్టమొదటి అభింశసన తీర్మానం ఇదే అవుతుంది.