KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులతోపాటు పలు ఐటీ సంస్థల అంశాలను కేంద్రమంత్రితో చర్చించారు.
అనంతరం ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావుతో కలిసి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. రైల్వే రంగానికి సంబంధించిన కొన్ని సమస్యలు, ఐటీ రంగానికి సంబంధించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు కొన్ని సూచనలు చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రోజు దక్షిణ మధ్యరైల్వేను పునర్విభజన చేసే కార్యక్రమం ఉందన్నారు. ఖాజీపేటలో రైల్వే డివిజన్ కావాలని వరంగల్, ఖాజీ పేట ప్రజలకు కోరిక . దయచేసి ఖాజీపేటలో ఒక రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. మా ప్రతిపాదన కాదు.. రైల్వే ఉద్యోగులు, నిపుణులు చేస్తున్నప్రతిపాదన.
మేము చేసిన ప్రతిపాదనలో ఖాజీపేట, బల్లార్ష , పెద్దపల్లి-నిజామాబాద్, ఖాజీపేట-ఎర్రుపాలెం, ఢోర్నకల్-మణుగూరు, మోతమర్రి-విష్ణుపురం, ఖాజీపేట-వంగపల్లి సెక్షన్లుండాలని సూచించామని.. రైల్వే ఉద్యోగులు కూడా ఈ విషయంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. 900 కిలోమీటర్లు మాత్రమే ఉండే గుంటూరును ఒక డివిజన్‌గా చేస్తామన్నారు. మాకు ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అట్లాగే 2200 కిలోమీటర్ల పొడవుతో విజయవాడ-గుంతకల్ పనులు జరుగుతున్నయి. ఖాజీపేటలో దాదాపు 2 వేల కిలోమీటర్ల ట్రాక్ ఉంది. దీన్ని కూడా డివిజన్‌గా ఏర్పాటు చేయాలని మేం కోరామన్నారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా కొత్తగూడెం డివిజన్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కేంద్రమంత్రికి వివరంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని కేటీఆర్ తెలిపారు. ఖాజీపేట డివిజన్ అనేది డిమాండ్‌గా, కొత్తగూడెం డివిజన్ మరో డిమాండ్‌గా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏ రకంగా చేస్తే బాగుంటుందో న్యాయం చేయాలని వారిని కోరడం జరిగిందన్నారు.
కాజీపేటలో డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని విజ్ఞప్తి చేశాము
900 కిలోమీటర్లు ఉన్న గుంటూరులో కూడా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు, అభ్యంతరం లేదు
కానీ 2,000 మీటర్ల రైల్వే ట్రాక్ ఉన్న కాజీపేటలో కూడా డివిజన్ ఏర్పాటు చేయాలని, కొత్తగూడెంలో కూడా డివిజన్ ఏర్పాటు… pic.twitter.com/B05ivZWcvu
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026