Johnson and Johnson | జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాజ్యం.. బిలియన్ డాలర్ల పరిహారానికి అంగీకారం
Johnson and Johnson | ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson and Johnson) బేబీ టాల్కమ్ పౌడర్ ఉత్పత్తిపై 15 ఏండ్లుగా కోర్టులో వ్యాజ్యం నడుస్తుంది. కేసులు వేసిన బాధితులకు పరిహారం చెల్లించేందుకు కంపెనీ ముందుకు వచ్చింది.
Johnson and Johnson | ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson and Johnson) బేబీ టాల్కమ్ పౌడర్ ఉత్పత్తిపై 15 ఏండ్లుగా కోర్టులో వ్యాజ్యం నడుస్తుంది. కేసులు వేసిన బాధితులకు పరిహారం చెల్లించేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. దీంతో సుమారు 76,000 మందికి దాదాపు 5.5 బిలియన్ డాలర్ల (రూ. 52,663 కోట్లు) పరిహారం ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించింది. 95 శాతం మంది అంగీకరిస్తే దశాబ్దాల పోరాటానికి తెరపడే అవకాశం ఉంది.
ఏమిటీ ఈ వ్యాజ్యం
యునైటెడ్ స్టేట్స్ (US)లో ఈ కంపెనీకి చెందిన బేబీ పౌడర్‌ను వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer) వచ్చిందని ఆరోపిస్తూ వేలమంది వినియోగదారులు 15 ఏండ్ల క్రితం కోర్టులో కేసు వేశారు. దీనిలో క్యాన్సర్‌కు కారకమైన ‘ఆస్బెస్టాస్’ రసాయనం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నా ఏండ్ల తరబడి సాగుతున్న కేసుకు ముగింపు చెప్పాలనే పరిహారం చెల్లించేందుకు ముందుకు వచ్చామని కంపెనీ వెల్లడించింది. ఈ కేసుపై ఇంకా ముందకువెళితే గెలుస్తామన్న నమ్మకం ఉంది. కానీ ప్రాణాలు కాపాడే మందులు, పరికరాలను రూపొందించాలనే లక్ష్యంతో ముందుకెళ్లేందుకు దీనికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నామని పేర్కొంది.
7 బిలియన్ డాలర్లకు చేరవచ్చు
ఈ ఏడాదిలో 3 బిలియన్ డాలర్లు చెల్లించి, మిగిలినవి 2028లోగా చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. కేసు పెట్టినవారిలో ఎంతమంది దీనికి అంగీకరిస్తారనేదానిపై ఈ పరిహారం ఉంటుందని, ఇది 7 బిలియన్ డాలర్లకుపైగా చేరవచ్చని కంపెనీ భావిస్తుంది. కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత సుదీర్ఘకాలం నడుస్తున్న కేసుల్లో ఒకటైన జాన్సన్ అండ్ జాన్సన్ కేసుకు తెరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

