తారౌబా: పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో.. వెస్టిండీస్ బౌలర్ జస్టిన్ గ్రీవ్స్(Justin Greaves) సత్తా చాటాడు. అతను వరుసగా అయిదు ఓవర్లు వేసి.. అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఆ ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండా మెయిడిన్స్ వేశాడు. తారౌబాలో జరుగుతున్న తొలి టెస్టులో.. పాక్ తన తొలి ఇన్నింగ్స్‌లో 282 రన్స్‌కు ఆలౌటైంది. మూడో రోజు మొత్తం 14 వికెట్లు పడ్డాయి. పాకిస్థాన్ బౌలర్ అబ్బాస్ నాలుగు వికెట్లు తీయడంతో వెస్టిండీస్ తన రెండో ఇన్నింగ్స్ ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 126 రన్స్ మాత్రమే చేసింది. ప్రస్తుతం వెస్టిండీస్ 155 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. పాక్ బ్యాటర్ మసూద్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ నమోదు చేశాడు. 64 నుంచి 72 ఓవర్ల మధ్య గ్రీవ్స్ అయిదు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అయిదు మెయిడిన్లు వేసిన అయిదు వికెట్లు తీయడంతో ఇదే తొలిసారి. గతంలో స్టువార్ట్ బ్రాడ్ ఓ సారి వరుసగా 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు అతని రికార్డును గ్రీవ్స్ బ్రేక్ చేశాడు.
𝑼𝒏𝒑𝒍𝒂𝒚𝒂𝒃𝒍𝒆 👊
Justin Greaves unleashed havoc with a glorious bowling spell ⚡
More on his amazing feat ➡️ https://t.co/7XajvpaQ4g pic.twitter.com/Y1urpBETgJ
— ICC (@ICC) July 28, 2026