Allu Arjun Fans | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ శౌర్య భవన్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 600 మందికి పైగా అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్, సోషల్ మీడియాలో నిత్యం ఎదురయ్యే అనవసరపు ట్రోల్స్, నెగెటివిటీపై తీవ్రంగా స్పందించారు. నెట్టింట జరిగే దుష్ప్రచారాలను, అనవసర వివాదాలను అస్సలు పట్టించుకోవద్దని, వాటికి ఎలాంటి స్పందన ఇవ్వకుండా సంయమనం పాటించాలని తన అభిమానులకు ఆయన హితవు పలికారు. అభిమానులందరూ సానుకూల ధోరణితో ముందుకు సాగాలని, తమ సమయాన్ని, శక్తిని మంచి పనులకే వెచ్చించాలని బన్నీ ఈ వేదికగా సందేశమిచ్చారు. అభిమానుల ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, వారితో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేశారు.
సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో రాకా సినిమా చేస్తున్నాడు ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా.. కళనిధి మారాన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం అనంతరం లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయబోతున్నాడు బన్నీ.
Icon Star #AlluArjun owning the stage at the AAFA Fan Meet 💥
Key takeaways from his speech 💬 👇
🔹 Heartfelt thanks to AAFA for organizing with pure class
🔹 Focus on unity & mutual respect among all fan clubs
🔹 Drives for social impact including blood donation & “One…
— Siddhesh 👿 (@DeelipSiddhesh) July 28, 2026