Trainee IPS : పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్టారెడ్డి (Uday Krishna Reddy) అరెస్టయ్యారు. మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డిని మిర్యాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండురోజులుగా గాలిస్తున్న పోలీసులు మంగళవారం ఆయనను అరెస్ట్ చేశారు. దాంతో, బాధితురాలి ఫిర్యాదుపై ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు.
మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల ఆరోపణుల ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గత రెండు రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆయన మంగళవారం మిర్యాలగూడలో అరెస్టయ్యారు. ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ తీసుకొచ్చి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు పోలీసులు.

హైదరాబాద్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు ఉదయ్ కృష్టారెడ్డి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. హైదరాబాద్లోని రెండు అడ్రస్ల్లోనూ ఆయన కనిపించలేదు. గత 4 రోజులుగా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులు.. చివరకు ఆయన పరారీలో ఉన్నారని నిర్ధారించుకున్నారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఆయన మిర్యాలగూడలో పోలీసులకు చిక్కారు.