Rahul Gandhi : కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని ప్రధాని మోదీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రహ్లాద్ జోషి నియామకంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రహ్లాద్ జోషి అత్యంత మోసకారి అని, పైగా రేపిస్టులకు మద్దతు పలికారని రాహుల్ అన్నారు. అలాంటి వ్యక్తికి విద్యాశాఖ మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రధాని మోదీని రాహుల్ ప్రశ్నించారు. మంగళవారం పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మోదీ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. ‘‘ఒక పక్క విద్యార్థులు, యువత దేశ విద్యావ్యవస్థపై ఆందోళన చేస్తున్నారు. ఎందరో యువతులు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. వారిపై దాడి చేశారు. పైగా.. రేపిస్టులకు మద్దతు పలికిన వారి (ప్రహ్లాద్ జోషి)ని బీజేపీ నియమించింది. ఆయన అత్యంత నీచమైన వ్యక్తి. అత్యాచారం చేసేవారికి మద్దతుగా నిలిచేవారికంటే చెడ్డవారు ఉండరు. అలాంటిది ఆ వ్యక్తే దేశ విద్యాశాఖ మంత్రి అయ్యారు. క్యాబినెట్లో ఎంతో మంది ఉన్నారు. వారిలో ఇంకెవరినైనా ప్రధాని మోదీ విద్యాశాఖ మంత్రిగా నియమించాల్సింది. ఇది ప్రధాని నుంచి ఊహించని స్పందన. ఇతరులెవరినైనా ఎంపిక చేయాల్సింది’’ అంటూ రాహుల్ విమర్శించారు.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్తానంలో మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.