నిషిన్: ఏషియన్ గేమ్స్ టీ20 క్రికెట్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో.. ఇండియా 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 113 రన్స్ చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఇండియాకు మంచి స్టార్ట్ ఇచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఆరంభంలో దూకుడుగా ఆడింది. అయితే అనవసరమైన రివర్స్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన వైభవ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అతను 15 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఇక టాప్ ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ అభిషేక్ శర్మ .. పాక్ బౌలర్లతో ఆడుకున్నాడు. భారీ సిక్సర్లు కొడుతూ అలరించాడు. అతను 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి .. స్కోరు బోర్డును వేగంగా పరిగెత్తించాడు. అయితే దూకుడుగా ఆడుతున్న అభిషేక్ ఆ జోరులోనే ఔట్ అయ్యాడు. అభిషేక్ 28 బంతుల్లో మూడు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 61 రన్స్ చేశాడు. అతను 217.85 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ఇండియాకు గట్టి పునాది వేశాడు. ప్రస్తుతం అయ్యర్, ఇషాన్ క్రీజ్‌లో ఉన్నారు.
6⃣1⃣ runs
2⃣8⃣ balls
3⃣ fours & 7⃣ sixes
2⃣1⃣7⃣.8⃣6⃣ strike rateAbhishek Sharma lights up the Final with a spectacular knock 🔥
Updates ▶️ https://t.co/g4wzZagyGj#TeamIndia | #AsianGames | @OfficialAbhi04 pic.twitter.com/OVjVf2DqGU
— BCCI (@BCCI) October 3, 2026