Abrar Ahmed : పొట్టి క్రికెట్లో భారత ఫ్రాంచైజీలు పాకిస్థాన్ ఆటగాళ్లను కొనడం మానేసి చాలా రోజులైంది. ఐపీఎల్ ఆరంభంలో కొందరికి అవకాశాలిచ్చినా ఆ తర్వాత మాత్రం పాక్ ఆటగాళ్లకు నో ఎంట్రీ బోర్డు పెట్టింది బీసీసీఐ. అలాంటిది ఇప్పుడు సన్‌రైజర్స్ జట్టులో దాయాది మిస్టరీ స్పిన్నర్‌కు చోటు దక్కింది. గురువారం జరిగిన ది హండ్రెడ్ వేలంలో అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed)ను సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ భారీ ధరకు కొన్నది.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ విదేశీ లీగ్స్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్(Hundred League)లోనూ ఇటీవలే ఆరెంజ్ ఆర్మీకి ఒక జట్టును కొన్నది. ఆ టీమ్ పేరు సన్‌రైజర్స్ లీడ్స్. తాజా వేలంలోపాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కావ్య మారన్ బృందం కొన్నది. తనను కొనుగోలు చేయడం పట్ల అబ్రార్ సంతోషం వ్యక్తం చేశాడు.
🚨 BIG STATEMENT BY ABRAR AHMED FOR KAVYA MARAN 🚨
“Thank you, Sunrisers Leeds, for picking me, and also thanks to Kavya Maran for showing her trust in me. I will make sure Sunrisers Leeds lift this year’s Hundred trophy.”
What’s your take 🤔pic.twitter.com/5yYZb3iXeK
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 12, 2026
‘నన్ను తీసుకున్నందుకు సన్‌రైజర్స్ లీడ్స్‌కు ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచినందుకు కావ్య మారన్‌కు కృతజ్ఞతలు. సన్‌రైజర్స్ జట్టు ఈ ఏడాది ది హండ్రెడ్ ట్రోఫీ గెలవడంలో నా వంతు పాత్ర పోషిస్తాను’ అని అబ్రార్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. సన్‌రైజర్స్ లీడ్స్ వేలంలో అబ్రార్‌ను లక్షా తొంభై వేల యూరోలకు (£190,000) భారతీయ కరెన్సీలో రూ.2.34 కోట్లకు దక్కించుకుంది.