Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీలో చీలిక.. మొహమ్మద్ జునైద్ సీజేపీని వీడబోతున్నారా
Cockroach Janta Party : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో చీలిక వచ్చిందని, కీలక నేతల మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయని ఒక ప్రచారం మొదలైంది. అయితే, ఈ ప్రచారంపై సీజేపీ కీలక నేత, వాలంటీర్ మొహమ్మద్ జునైద్ స్పందించారు.
Cockroach Janta Party : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో చీలిక వచ్చిందని, కీలక నేతల మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయని ఒక ప్రచారం మొదలైంది. అయితే, ఈ ప్రచారంపై సీజేపీ కీలక నేత, వాలంటీర్ మొహమ్మద్ జునైద్ స్పందించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, పార్టీలో చీలిక లేదని వెల్లడించారు. నేతలమధ్య ఎలాంటి విబేధాలు లేవన్నారు. మొహమ్మద్ జునైద్ సీజేపీలో కీలక వాలంటీర్‌గా ఉన్నారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆందోళన సందర్భంగా జునైద్ కమ్యూనిటీ కిచెన్ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. నిరసనల్లో పాల్గొన్నవారికి ఆహారం అందించాడు. సీజేపీకి మద్దతుగా భారీ ప్రచారం చేశారు. ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో అతడికి మంచి గుర్తింపు దక్కింది. కానీ, ఇటీవల అతడికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కేతోపాటు పార్టీలోని ఇతర నేతలతో అతడికి విబేధాలు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో జునైద్ సీజేపీని వీడుతారనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ఒక వీడియో కూడా గతంలో వైరల్ అవుతోంది. సీజేపీ తన నిరసన విరమించే ముందు తనను సంప్రదించలేదని వీడియోలో జునైద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జునైద్ పార్టీని వీడుతారని, పార్టీలో చీలిక అంటూ ప్రచారం ఊపందుకుంది.
ఈ ప్రచారంపై జునైద్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నాడు. తాను సీజేపీని వీడటం లేదన్నాడు. తనను సీజేపీ నేతలు సమర్ధిస్తున్నారని, వారి మద్దతు తనకు ఉందని వెల్లడించారు. తమ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొందరు ఇలా దుష్ప్రచారం చేస్తున్నానరిన జునైద్ మండిపడ్డాడు. తమ పార్టీని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని జునైద్ ఆరోపించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

