Auto Driver | ఫ్రీ బస్ పెట్టినవ్.. అది మాకు శాపమైంది.. సీఎం రేవంత్ రెడ్డిపై ఆటోడ్రైవర్ ఫైర్
Auto Driver | నువ్వు రాష్ట్రానికి సీఎం. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.12 వేలు ఇస్తా అన్నవ్. ఫ్రీ బస్ పెట్టినవ్. అది మాకు శాపమైంది. అయినా కూడా మా జీవనోపాధి మేం ఎలాగోలా చూసుకుంటున్నం. ఆదాయం వచ్చినా రాకపోయినా మిమ్మల్ని అడగలేదు అని సీఎం రేవంత్ రెడ్డిపై ఆటోడ్రైవర్లు ఫైర్ అవుతున్నారు.
Auto Driver | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పేది ఒకటి ఆ తర్వాత చేసేది మరొకటి అని ఆటోడ్రైవర్లు ఫైర్ అవుతున్నారు. ఓ ఆటోడ్రైవర్ మాట్లాడుతూ.. 50 ఏండ్ల నుంచి చూస్తున్నం. ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలే. ఎట్లా మోసం చేయాలే వాళ్లకు ఒక్కళ్లకే తెలుస్తది. వేరే వాళ్లకు తెలియదు. ఆటోడ్రైవర్లకు రూ.12 వేల రూపాయలు ఇవ్వమని నేను అడగలేదు.. నువ్వు ఇస్తా అన్నవ్. నువ్వు మా లెక్క సాధారణ మనిషివైతే మర్చిపోతాం. నువ్వు రాష్ట్రానికి సీఎం. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.12 వేలు ఇస్తా అన్నవ్. ఫ్రీ బస్ పెట్టినవ్. అది మాకు శాపమైంది. అయినా కూడా మా జీవనోపాధి మేం ఎలాగోలా చూసుకుంటున్నం. ఆదాయం వచ్చినా రాకపోయినా మిమ్మల్ని అడగలేదు.
మా భార్య, పిల్లలు ఈ రోజు రోడ్డుమీదికి వచ్చినం. ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేదు. ఇంత దరిద్రంగా ఆటోడ్రైవర్లను తయారు చేసినవంటే.. మొత్తం రవాణా రంగాన్ని దివాళా తీసిందంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కనీసం చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా పరామర్శించలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకలి చావులతో ఇప్పటి వరకు వందల మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా పరామర్శించలేదన్నారు. పొన్నం ప్రభాకర్ను ఇప్పటికి నాలుగు సార్లు కలిస్తే మాటలు మాత్రమే మంచిగా చెప్తున్నాడు.. పని చేయడం లేదు. ఆకలి మీద ఉన్నవాడికి అన్నం పెడతాను అని పిలిచి పెట్టకుండా పంపడం సరికాదని మండిపడ్డారు.
ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇవ్వాలని మేము నిన్ను అడగలేదు.. నువ్వే ఇస్తాను అన్నావు
మొత్తం ట్రాన్స్పోర్ట్ రంగం దివాలా తీసింది అంటే అది రేవంత్ రెడ్డి వల్లనే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకలి చావులతో ఇప్పటి వరకు వందల మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు
కనీసం చనిపోయిన ఆటో డ్రైవర్ల… pic.twitter.com/ZIf4f28SJO
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

