Pooja Meri Jaan | బాలీవుడ్ నటిమణులు హూమా ఖురేషి (Huma Qureshi), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘పూజా మేరీ జాన్’ (Pooja Meri Jaan). దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఎట్టకేలకు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee5) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 2న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
మ్యాడాక్ ఫిలింస్ (Maddock Films) బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నవజోత్ గులాటి దర్శకత్వం వహించారు. ఇందులో విపాషా అరవింద్ కో-డైరెక్టర్‌గా వ్యవహరించగా, విశాల్ మిశ్రా సంగీతం అందించారు. సమాజంలో ప్రేమ పేరుతో జరిగే అతివ్యామోహం (Obsession), స్టాకింగ్, అనుమానాలు మరియు అకారణంగా ఎదురయ్యే నిందల నేపథ్యంలో ఈ సినిమా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ‘పూజా’ అనే కీలక పాత్రలో నటిస్తుండగా, ఆమెకు అండగా నిలిచే లాయర్ ‘సనా’ పాత్రలో హూమా ఖురేషి కనిపించనున్నారు వీరితో పాటు విజయ్ రాజ్, విక్రమ్ సింగ్ చౌహాన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకులు మరియు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.