Shocking incident | రేవంత్ రెడ్డి సొంత మండలంలో దారుణం..మహిళా సర్పంచ్‌ను బూతులు తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
Shocking Incident | రాష్ట్రాన్ని పాలించే నాయకుడే సక్రమంగా లేనప్పుడు ఇక ఆయన కింద పనిచేస్తున్న నాయకుల ప్రవర్తన మరింత దారుణంగా ఉంటుందని గ్రామస్థులు వాపోతున్నారు.
నాగర్ కర్నూల్ : రాష్ట్రాన్ని పాలించే నాయకుడే సక్రమంగా లేనప్పుడు ఇక ఆయన కింద పనిచేస్తున్న నాయకుల ప్రవర్తన మరింత దారుణంగా ఉంటుందని గ్రామస్థులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సొంత మండలమైన వంగూరు మండలం జాజాల గ్రామ సర్పంచ్ కాశమ్మ ( Sarpach Kasamma ) ను జనరల్ బాడీ సమావేశంలో అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ దారుణంగా బూతులు తిట్టడం సంచలనంగా మారింది.
తన నగలు అమ్మి గ్రామాభివృద్ధి కోసం ఖర్చు పెట్టగా దానికి సంబంధిన బిల్లును ఆపడం పట్ల సర్పంచ్ కాశమ్మ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘నీకు పొగరు ఎక్కువైంది. సర్పంచ్ అయినందుకు విర్రవీగుతున్నావు. మాటలు ఎక్కువవుతున్నాయి. కలెక్టర్‌కు చెప్పి నిన్ను సస్పెండ్ చేయిస్తా. ఎక్కడ చెప్పినా నేను భయపడను అంటూ ఎమ్మెల్యే తనను దూషించాడని ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. గ్రామ పరిధిలో ఉన్న వాగు నుంచి ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే తనపై పగ తీర్చుకుంటున్నాడని ఆమె ఆరోపించింది.
రేవంత్ రెడ్డి సొంత మండలంలో మహిళా సర్పంచ్‌ను బూతులు తిట్టిన అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే ఎమ్మెల్యే తనపై పగ తీర్చుకుంటున్నాడంటూ మహిళా సర్పంచ్ ఆవేదన
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజాల గ్రామ సర్పంచ్ కాశమ్మను జనరల్ బాడీ సమావేశంలో… pic.twitter.com/bocwgk3j9z
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2026
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

