ఏపీ జలదోపిడీపై బీజేపీ మౌనవ్రతం!
తెలంగాణ జీవనాడి కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా మౌనం వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ముఖ్యంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి అనుమతులు లేకుండా నీటిని తరలించేందుకు పొరుగు రాష్ట్రం ప్రయత్నిస్తున్నా రాష్ర్టానికి చెందిన కమలనాథులు కనీసం స్పందించకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
- ఎన్టీయేలో టీడీపీ కీలక భాగస్వామి..
- అందుకే బీజేపీ ఎంపీలు నోరెత్తట్లేదని విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జీవనాడి కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా మౌనం వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ముఖ్యంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి అనుమతులు లేకుండా నీటిని తరలించేందుకు పొరుగు రాష్ట్రం ప్రయత్నిస్తున్నా రాష్ర్టానికి చెందిన కమలనాథులు కనీసం స్పందించకపోవడంపై సాగునీటి రంగ నిపుణులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో, ఆ పార్టీ అధినాయకత్వం డైరెక్షన్లోనే రాష్ట్ర బీజేపీ నడుస్తున్నదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాల ముసుగులో పొరుగు రాష్ట్రం చేపడుతున్న నీటి వినియోగ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తున్నదని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతల నుంచి కనీస ఖండన, స్పష్టత రాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఈ జల దోపిడీని అడ్డుకుంటారా లేక మౌనంగా ఉంటారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌తో పాటు రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు జల వివాదాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు రాజకీయవర్గాల్లో వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా కృష్ణా పరీవాహక ప్రాంతానికి చెందిన మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సైతం సాగర్ నీటి తరలింపుపై గట్టిగా గళం విప్పడం లేదని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉండటంతో, ఆ పార్టీ అధినాయకత్వం ఒత్తిడి వల్లే రాష్ట్ర బీజేపీ నేతలు మౌనంగా ఉంటున్నారని బీఆర్ఎస్ నాయకత్వం ఆరోపిస్తున్నది. నాగార్జునసాగర్ నీటి మట్టాలు అడుగంటుతుండటంతో హైదరాబాద్ మహా నగరంతోపాటు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు రాబోయే వేసవిలో తీవ్ర తాగునీటి సంక్షోభం ఏర్పడే ప్రమా దం ఉన్నది. ఇంతటి కీలకమైన ప్రజల జీవన్మరణ సమస్యపై ఒకమాట కూడా మాట్లాడని బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉన్నదా అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

