అమెరికా ఆంక్షలను తప్పించుకొనేందుకు రహస్య ఆపరేషన్!
అధునాతన సెమీకండక్టర్, కృత్రిమ మేధ చిప్‌లను సమకూర్చుకోవడం, ప్రపంచ చిప్ పరిశ్రమపై సమాచారం సేకరించడాన్ని చైనా నిఘా సంస్థ పనిగా పెట్టుకున్నదని న్యూయార్క్ టైమ్స్(ఎన్‌వైటీ) నివేదిక తెలిపింది.
- అధునాతన ఏఐ చిప్‌ల సేకరణకు ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు
- చైనా నిఘా సంస్థ ప్రయత్నిస్తున్నదన్న ఎన్ వైటీ..ఖండించిన చైనా
బీజింగ్: అధునాతన సెమీకండక్టర్, కృత్రిమ మేధ చిప్‌లను సమకూర్చుకోవడం, ప్రపంచ చిప్ పరిశ్రమపై సమాచారం సేకరించడాన్ని చైనా నిఘా సంస్థ పనిగా పెట్టుకున్నదని న్యూయార్క్ టైమ్స్(ఎన్‌వైటీ) నివేదిక తెలిపింది. పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా అమెరికా ఎగుమతి ఆంక్షలను తప్పించుకునేందుకు కనీసం రెండేండ్లుగా ఈ సంస్థ ఈ రహస్య ఆపరేషన్ నిర్వహిస్తున్నదని పేర్కొంది.
ఈ ప్రయత్నాలకు నేతృత్వం వహించేందుకు చైనా భద్రత శాఖ అధిపతి చెన్ యిసిన్ ఆధ్వర్యంలో ఒక కార్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసియా, అమెరికా, యూరప్‌లకు చెందిన ప్రస్తుత, మాజీ భద్రతా-నిఘా అధికారుల నివేదికను ఉటంకించింది. అధునాతన చిప్‌లను చైనా కంపెనీలు కొనుగోలు చేయడం, దేశంలోకి అక్రమంగా తరలించడంలో తోడ్పడటంతో పాటు సెమీకండక్టర్ పరిశ్రమ, దాని సరఫరా వ్యవస్థలపై సమాచారం సేకరించడం ఈ ఆపరేషన్‌లో భాగమని వివరించింది.
ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్‌పై నిఘా పెట్టేందుకు చైనా నిఘా సంస్థతో చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్ కలిసి పనిచేసినట్లు అమెరికా అధికారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 21న ప్రచురితమైన ఎన్ వైటీ కథనం, అంతకు ముందు రోజు దర్యాప్తు కథనాన్ని కొనసాగించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

