శిలాజ ఇంధనాలపై కుదరని ఏకాభిప్రాయం
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భూతాపం కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై వివిధ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తుర్కియేలోని అంటల్యాలో రెండు వారాలపాటు జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్-31) ఆదివారం కీలక ఒప్పందం లేకుండానే ముగిసింది.
- ఒప్పందం లేకుండానే ముగిసినఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు
- బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగంపై దేశాల మధ్య విభేదాలు
అంటల్యా: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భూతాపం కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై వివిధ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. తుర్కియేలోని అంటల్యాలో రెండు వారాలపాటు జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్-31) ఆదివారం కీలక ఒప్పందం లేకుండానే ముగిసింది. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం నుంచి వైదొలగే అంశాన్ని తుది ప్రకటనలో చేర్చాలా? వద్దా? అనేదానిపై విభేదాలు తలెత్తాయి.
తుర్కియే, ఆస్ట్రేలియా రూపొందించిన ప్రతిపాదనను యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు వ్యతిరేకించాయి. రష్యా, సౌదీ అరేబియా శిలాజ ఇంధనాల ప్రస్తావనను వ్యతిరేకించాయి. 2023లో దుబాయ్ సదస్సులో శిలాజ ఇంధనాల నుంచి క్రమంగా వైదొలగాలని నిర్ణయించినప్పటికీ ఆ తర్వాతి చర్చల్లో దీనిపై స్పష్టత కొరవడింది. కార్బన్ క్యాప్చర్, నిల్వకు ప్రాధాన్యమివ్వడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పేద దేశాలకు ఆర్థిక సాయం, వాతావరణ మార్పులపై కార్యాచరణ వంటి అంశాలు వచ్చే ఏడాది ఇథియోపియా సదస్సుకు వాయిదా పడ్డాయి.
అయితే విద్యుత్ వినియోగాన్ని పెంచే ప్రతిపాదనకు దాదాపు 100 దేశాలు మద్దతు తెలిపాయి. 2035 నాటికి మొత్తం ఇంధన వినియోగంలో విద్యుత్ వాటాను 21 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. పారిస్ ఒప్పందం నిర్దేశించిన 1.5 డిగ్రీల భూతాప పరిమితిని ప్రపంచం దాటడం అనివార్యమని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు 2.7-3 డిగ్రీలు పెరిగే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2026 అత్యంత వేడి సంవత్సరంగా నమోదయ్యే అవకాశం 97 శాతమని బెర్క్లీ ఎర్త్ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

