నేడు కేఆర్ఎంబీతో బీఆర్ఎస్ బృందం భేటీ
హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కీలకమైన నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వలను పరిరక్షించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో చేపడుతున్న సొరంగం నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులను కలువనున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో కూడిన సుమారు 10 మంది సభ్యుల బృందం ఉదయం 10.30 గంటలకు బోర్డు అధికారులకు వినతిపత్రం అందజేయనున్నది.
- నాగార్జున సాగర్ జలాలు పరిక్షించాలని వినతి
- వాటర్ గ్రిడ్‌పై ఫిర్యాదు చేయనున్న బృందం
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కీలకమైన నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వలను పరిరక్షించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో చేపడుతున్న సొరంగం నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులను కలువనున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో కూడిన సుమారు 10 మంది సభ్యుల బృందం ఉదయం 10.30 గంటలకు బోర్డు అధికారులకు వినతిపత్రం అందజేయనున్నది.
పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న సొరంగం నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతులు, నీటి కేటాయింపులు, అంతర్రాష్ట్ర నదీజలాల ఒప్పందాలు, వాటి ప్రభావంపై బోర్డు సమగ్రంగా పరిశీలించాలని ప్రతినిధి బృందం కోరనున్నది. హైదరాబాద్ నగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్‌లో తగిన నీటి నిల్వలను కాపాడాలని, ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న నిర్మాణాలతో తెలంగాణ నీటి హకులకు, తాగునీటి ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేయనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

