ఏఐ వర్చువల్ కణం!
మనిషి శరీరంలోని ఒక్కో కణం ఎలా పనిచేస్తున్నది? అందులోని జన్యువులు, ప్రొటీన్లు, ఇతర అణువుల మధ్య ఎలాంటి పరస్పర చర్యలు జరుగుతున్నాయి? ఒక వ్యాధి వచ్చినప్పుడు కణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి..
- కంప్యూటర్లోనే మనిషి కణాన్ని సృష్టించే ప్రయత్నం!
- వ్యాధులు ఎలా వస్తాయి? మందులు ఎలా పనిచేస్తాయి?
- ఇక వర్చువల్ సెల్‌తో ముందుగానే తెలుసుకునే అవకాశం
- కృత్రిమ మేధతో శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం
న్యూఢిల్లీ: మనిషి శరీరంలోని ఒక్కో కణం ఎలా పనిచేస్తున్నది? అందులోని జన్యువులు, ప్రొటీన్లు, ఇతర అణువుల మధ్య ఎలాంటి పరస్పర చర్యలు జరుగుతున్నాయి? ఒక వ్యాధి వచ్చినప్పుడు కణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ఒక ఔషధం కణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు శాస్తవ్రేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ‘వర్చువల్ సెల్స్’ (డిజిటల్ కణాలు)ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
జీవకణాన్ని కంప్యూటర్లోనే నమూనాగా రూపొందించి, దాని పనితీరును అనుకరించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇది విజయవంతమైతే ప్రయోగశాలలో ప్రతి పరీక్షను నిర్వహించకుండానే కొన్ని జీవశాస్త్ర ప్రక్రియలను కంప్యూటర్లో పరిశీలించే అవకాశం ఉంటుంది. ఔషధాల అభివృద్ధి, క్యాన్సర్ పరిశోధన, వ్యక్తిగత చికిత్సల రూపకల్పనలో ఇది కీలక మార్పులకు దారితీయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
కణమే ఒక సంక్లిష్ట ప్రపంచం
మన శరీరంలోని ప్రతి కణం ఒక చిన్న జీవ వ్యవస్థ వంటిది. అందులో వేలాది రకాల అణువులు, ప్రొటీన్లు, జన్యువులు నిరంతరం పరస్పరం ప్రభావితం చేసుకుంటుంటాయి. ఒక జన్యువులో చిన్న మార్పు జరిగితే, దాని ఆధారంగా తయారయ్యే ప్రొటీన్ ఆకృతి మారవచ్చు. దాంతో ఆ ప్రొటీన్ తన విధిని సరిగా నిర్వర్తించకపోవచ్చు. ఈ మార్పుల ప్రభావం క్రమంగా ఇతర జీవక్రియలపై పడుతూ వ్యాధులకు కారణమవుతుంది. ఇలాంటి సంక్లిష్ట సంబంధాలన్నింటినీ ఒకేసారి అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పెద్ద సవాలే. అందుకే నిజమైన కణాల్లో సేకరించిన భారీ జీవశాస్త్ర సమాచారాన్ని ఏఐ మోడళ్లకు అందించి, కణాల ప్రవర్తనను అంచనా వేసే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి.
క్యాన్సర్ చికిత్స నుంచి వ్యక్తిగత వైద్యం వరకు..
వర్చువల్ సెల్స్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే వైద్య రంగంలో అనేక ప్రయోజనాలు కలగవచ్చు. కొత్త మందులను మనుషులపై పరీక్షించే ముందు కంప్యూటర్ నమూనాల్లో వాటి ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. క్యాన్సర్ కణాలు రోగనిరోధక వ్యవస్థ నుంచి ఎలా తప్పించుకుంటున్నాయో అధ్యయనం చేయవచ్చు. ఒక రోగి కణాల లక్షణాలకు అనుగుణంగా ఏ ఔషధం మెరుగ్గా పనిచేసే అవకాశం ఉన్నదో పరిశీలించవచ్చు. మందుల వల్ల కణాల్లో కలిగే అనవసర మార్పులను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.
అసలు సవాళ్లు ఏమిటి?
ఏఐ ఇచ్చే అంచనాలు ఎందుకు వచ్చాయో వివరించడం ఒక సమస్య. కొన్నిసార్లు ఏఐ ఒక ఫలితాన్ని సూచించినా, దానికి కారణమైన జీవశాస్త్ర ప్రక్రియను స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. ఏఐకి అందించే సమాచారం అసంపూర్ణంగా ఉంటే అంచనాలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

