జీరో డిప్రిసియేషన్ కవరేజీ.. విడిభాగాల ఖర్చుపై ఈ వాహన బీమాతో తగ్గనున్న భారం
వాహనంలో ఏదైనా విడిభాగం దెబ్బతింటే.. ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ మరమ్మతుల బిల్లు పెరుగవచ్చు. కొన్ని విడిభాగాలకు క్లెయిమ్ లెక్కించేటప్పుడు బీమా సంస్థలు సదరు భాగం విలువ తరుగుదల మొత్తాన్ని మినహాయించడమే కారణం.
వాహనంలో ఏదైనా విడిభాగం దెబ్బతింటే.. ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ మరమ్మతుల బిల్లు పెరుగవచ్చు. కొన్ని విడిభాగాలకు క్లెయిమ్ లెక్కించేటప్పుడు బీమా సంస్థలు సదరు భాగం విలువ తరుగుదల మొత్తాన్ని మినహాయించడమే కారణం. అందుకే విడిభాగం మార్చడానికి అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని వాహనదారుడే చెల్లించాల్సి వస్తుంది. అయితే పాలసీ నిబంధనలకు లోబడి బీమా కవరేజీ ఉన్న విడిభాగాలపై విలువ తరుగుదల మినహాయింపును రద్దుచేసే జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ఈ ఖర్చును తగ్గించడంలో తోడ్పడగలదు. టూ-వీలర్, కార్లు ఇతరత్రా వాహనాల ఇన్సూరెన్స్ పాలసీలను పోల్చేటప్పుడు.. వినియోగం, తరచూ చేసే ప్రయాణాలను దృష్టిలో పెట్టుకొని అదనపు ప్రీమియం చెల్లించి ఈ కవరేజీ తీసుకోవడం లాభదాయకం.
ఏమిటి ఈ బీమా?
ప్రమాదం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న విడిభాగాలను మార్చే ఖర్చులో జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే నష్ట తీవ్రత, దెబ్బతిన్న విడిభాగాలు, పాలసీలో పేర్కొన్న నిబంధనలపైనే ఈ ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. ప్రమాదంలో బైక్ ప్లాస్టిక్ బాడీ ప్యానల్ లేదా కార్ విడిభాగాలు దెబ్బతింటే.. వాటిని మార్చే ఖర్చు నుంచి మినహాయించే విలువ తరుగుదల మొత్తాన్ని ఈ యాడ్-ఆన్ భరించగలదు. అయితే ఈ యాడ్-ఆన్ ప్రతి మరమ్మతు లేదా ప్రతి ఖర్చును కవర్ చేయదు. ఆయా మినహాయింపులు, క్లెయిమ్ పరిమితులు, ఇతర నిబంధనలు వర్తిస్తాయి మరి. కాబట్టి ఏయే అంశాలకు కవరేజీ ఉంటుందో తెలుసుకోవడానికి పాలసీ నిబంధనలను కొనడానికి ముందే తప్పక పరిశీలించాలి.
ఎప్పుడు ఎంచుకోవాలి?
- పాత వాహనాల కంటే కొత్తవి కొన్నవారికి ఈ యాడ్-ఆన్ ఉపయుక్తంగా ఉంటుంది.
- ఎక్కువగా ప్రయాణాలు చేసే వాహనదారులకు లాభదాయకం.
- లగ్జరీ, ప్రీమియం వెహికిల్స్‌ను వాడేవారికి ఈ కవరేజీతో మరింతగా మేలుంటుంది.
గుర్తుంచుకోండి..
- సాధారణ ఓన్-డ్యామేజ్ కవరేజీ ప్రాథమిక పాలసీపై ఈ జీరో డిప్రిసియేషన్ బీమా కవరేజీ ఆధారపడి ఉంటుందన్నది మరువవద్దు.
- జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్‌తో అదనపు ప్రీమియం వర్తిస్తుంది.
- సాధారణ యాడ్-ఆన్ నిబంధనల ప్రకారం వాహనం పూర్తి నష్టానికి జీరో డిప్రిసియేషన్ ప్రయోజనాలు వర్తించవు.
- పాలసీల మధ్య కచ్చితమైన నిబంధనలు మారవచ్చు. కాబట్టి రెండు ఎంపికలను పోల్చే ముందు పాలసీ నిబంధనలను చూడాలి.
- మీ వాహనానికి ఈ కవరేజీ వర్తిస్తుందో? లేదో? అనేది తెలుసుకోవాలి.
- పాలసీ కాలంలో యాడ్-ఆన్‌ను ఎన్నిసార్లు ఉపయోగించవచ్చన్నది చూసుకోవాలి.
- టైర్లు, బ్యాటరీలు వంటివి బీమా కవరేజీలో ఉన్నాయా? మినహాయించారా? అనేది పరిశీలించాలి.
- పాలసీ కొనుగోలుకు ముందే అదనపు చెల్లింపులపై ఆరా తీయాలి.
- యాడ్-ఆన్ ఇచ్చే ప్రయోజనంతో అదనపు ఖర్చులను పోల్చి ఓ నిర్ణయానికి రావాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

