టోక్యో: ఆసియా క్రీడల(Asian Games) హాకీ ఈవెంట్లో ఇండియా దుమ్మురేపుతోంది. పూల్ ఏ నుంచి భారత జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 8-2 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత స్ట్రయికర్ దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దిల్‌ప్రీత్‌తో పాటు అభిషేక్, శిలానంద్ లక్రా, సుఖ్జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రాజిందర్ సింగ్ కూడా గోల్స్ చేశారు. ఆసియా గేమ్స్ చరిత్రలోనే తొలిసారి దక్షిణ కొరియాపై ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ విక్టరీతో ప్రస్తుతం పూల్ ఏ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. శనివారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు జపాన్‌తో భారత్ తలపడనున్నది.
𝗔 𝗧𝗛𝗜𝗥𝗗 𝗦𝗧𝗥𝗔𝗜𝗚𝗛𝗧 𝗪𝗜𝗡! 🇮🇳🔥
The Indian Men’s Team’s commanding 8-2 victory over South Korea is not only their third consecutive at Asian Games 2026 but also the best ever against the South Koreans in Asian Games history ! 🏑💪
India now turn their attention to… pic.twitter.com/yQRyC5mlKz
— Hockey India (@TheHockeyIndia) September 24, 2026