– ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సంఘ నాయకుల వినతి
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తురక కాశ కార్మికుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన జనరేటర్లు అర్హులైన కార్మికులకు అందేలా చూడాలని తురకకాశ సంక్షేమ సంఘం నాయకులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన జనరేటర్ల కేటాయింపులో అర్హులైన కొందరు కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. జనరేటర్ల కేటాయింపు ప్రక్రియపై తమకు పలు అభ్యంతరాలు ఉన్నాయని, అర్హులైన అసలైన తురకకాశ కార్మికులకు ఈ పథకం ప్రయోజనం అందేలా చూడాలని కోరారు. జనరేటర్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపి నిర్దేశించిన నిబంధనల ప్రకారం అర్హులకు జనరేటర్లు అందేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బికారి, బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు షేక్ అజీజ్, అశ్వాపురం మండల అధ్యక్షుడు షేక్ ఖలీల్, జనరల్ సెక్రటరీ షేక్ మదర్వలి, అంజనాపురం గ్రామ అధ్యక్షుడు షేక్ ఖాసీం, రాజమ్మద్ పాల్గొన్నారు.