CM Revanth Reddy : మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరిట భారీగా ప్రజాధనం లూటీ చేయాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మూసీ సుందరీకరణ అంచనా వ్యయం లక్షన్నర కోట్లుగా తేల్చిన రేవంత్ మరో భారీ మొత్తంపై కన్నేశారు. హైదరాబాద్ రవాణా వ్యవస్థ అభివృద్ధి పేరిట రూ.4 లక్షల కోట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం.
హైదరాబాద్ రవాణా వ్యవస్థపై HMDA ప్రణాళికను విడుదల చేసింది. 2050 నాటికి 556.6 కి.మీ మేర మెట్రో నెట్వర్క్ విస్తరణ, ఎంఎంటీఎస్ నెట్వర్క్ 336.4 కి.మీ మేర విస్తరణ, రోడ్ నెట్వర్క్ 19,352 కిలోమీటర్లకు విస్తరించనున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది. ఇందులో భాగంగా.. 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ లకు, మూసీపై 29 వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రవాణా వ్యవస్థ ప్రణాళిక అమలుకు రూ.4 లక్షల కోట్లు అవసరమని అంచనా వేసింది.
మరో 4 లక్షల కోట్లకు టెండర్ పెట్టిన రేవంత్ రెడ్డి!
మూసీ లక్షన్నర కోట్లు అయిపోయింది.. ఇప్పుడు మరో నాలుగు లక్షల కోట్లకు రంగం సిద్ధం
హైదరాబాద్ రవాణా వ్యవస్థపై ప్రణాళికను విడుదల చేసిన HMDA
2050 నాటికి 556.6 కి.మీ మేర మెట్రో నెట్వర్క్ విస్తరణ, ఎంఎంటీఎస్ నెట్వర్క్ 336.4 కి.మీ మేర… pic.twitter.com/QfTZDl673C
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2026