Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్‌లో వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థకు గురైన విషయం తెలిసి, ఆందోళన చెందిన కేసీఆర్ ఉదయం నుంచి పెద్ది ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, వినోద్, జిల్లా నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు.
కాగా.. ఆరోగ్య సమాచారాన్ని, మెరుగైన చికిత్స కోసం వారు చేస్తున్న కృషిని డాక్టర్లు కేసీఆర్ గారికి వివరిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది.