Driving Licences | గీత దాటితే లైసెన్స్ రద్దే.. 9నెలల్లో 1260 లైసెన్స్‌ల రద్దుకు సిఫార్స్‌లు
వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దును ప్రయోగిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై , ట్రాఫిక్, రవాణా నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన 9 నెలల్లో 1260 లైసెన్స్‌ల రద్దునకు ఆర్టీఏకు సిఫారసులు వచ్చాయి.
- 270 లైసెన్స్‌లు రద్దు చేసిన అధికారులు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దును ప్రయోగిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై , ట్రాఫిక్, రవాణా నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన 9 నెలల్లో 1260 లైసెన్స్‌ల రద్దునకు ఆర్టీఏకు సిఫారసులు వచ్చాయి. అందులో 270 లైసెన్స్‌లను అధికారులు రద్దు చేశారు. తొలుత జరిమానాలతో సరిపెడుతూనే , పదేపదే నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నారు.ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చే లైసెన్సుల రద్దు ప్రక్రియను వేగవంతం చేసి ఉల్లంఘనదారులను బెంబేలెత్తిస్తున్నారు. లైసెన్స్ సస్పెండ్ చేసేందుకు రెండు కేటగిరులుగా విభజించారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులు మొదటి క్యాటగిరిగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నవాటిని రెండో క్యాటగిరిగా వర్గీకరించి కేసులు నమోదు చేస్తున్నారు. వీటితో పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేసే ప్రక్రియపై కూడా కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు లైసెన్స్ రద్దులో ఉన్నప్పుడు వాహనం నడుపుతూ దొరికితే జైలు శిక్ష కూడా పడే వీలుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పోలీసుల నుంచి ఉల్లంఘనదారుడి వివరాలు రవాణాశాఖకు చేరుకుంటాయి. వారు పరిశీలించి సదరు వ్యక్తికి నోటీసులు పంపిస్తారు. పది రోజుల్లో అతడు తన వివరణను ఆర్టీఏ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం రవాణా శాఖ అధికారులు నిర్ణయం మేరకు లైసెన్స్ రద్దు ప్రక్రియ జరుగుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guidance Tamil Nadu | ‘పెట్టుబడుల’ లీక్‌పై రాజకీయ ప్రకంపనలు.. ఏపీ, తమిళనాడు మధ్య వివాదం ముదురుతోందా?
Rajasthan Elections | రాజస్థాన్‌లో బీజేపీకి ఘోర పరాభవం.. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో 70% సీట్లలో పరాజయం
Raja Gopal Reddy | రాజగోపాల్‌రెడ్డికి హైకమాండ్ పిలుపు.. 23న ఏం జరగబోతున్నది?
Gurukul Teachers | ఒక్కో గురుకులంలో ఒక్కో వేతనం.. పార్ట్‌టైమ్ టీచర్లకు అన్యాయం!
గ్రామ స్వరాజ్యానికి గ్రహణం.. ఆర్థికంగా కుదేలైన తెలంగాణ పంచాయతీలు.. ఆర్బీఐ నివేదికలో జీపీల దుస్థితి బట్టబయలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

