రాజస్థాన్‌లో బీజేపీకి ఘోర పరాభవం
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గెలుపొందడం సర్వసాధారణం. కానీ రాజస్థాన్‌లో సీన్ రివర్స్ అయింది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మొత్తం 37 జిల్లాల్లో కేవలం ఆరు జిల్లాల్లో మాత్రమే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. మిగిలిన 31 జిల్లాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సొంత జిల్లాల్లో సైతం అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.
- స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి భారీ ఎదురుదెబ్బ
- పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో 70% సీట్లలో పరాజయం
- సీఎం, మంత్రుల నియోజక వర్గాల్లో సైతం తప్పని ఓటమి
- మంత్రుల సొంత కుటుంబ సభ్యులకూ తప్పని ఓటమి
న్యూఢిల్లీ, నవంబర్ 21: స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గెలుపొందడం సర్వసాధారణం. కానీ రాజస్థాన్‌లో సీన్ రివర్స్ అయింది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మొత్తం 37 జిల్లాల్లో కేవలం ఆరు జిల్లాల్లో మాత్రమే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగింది. మిగిలిన 31 జిల్లాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సొంత జిల్లాల్లో సైతం అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. రాజస్థాన్‌లో శుక్రవారం జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు దాదాపు 70 శాతం పంచాయతీ సీట్లను, రెండింతల జిల్లా పరిషత్ సీట్లను గెలుచుకున్నారు.
సీఎం భజన్‌లాల్‌శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగవేర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంగవేర్ పంచాయతీ సమితిలో మొత్తం 15 స్థానాలకు గాను 8 సీట్లను సహనుమాన్ బెనివాల్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ గెలుచుకుంది. భరత్పూర్ జిల్లా పరిషత్‌లోని మొత్తం 31 స్థానాలకు గాను బీజేపీ కేవలం 9 స్థానాలను గెలుచుకుంది. మరో రెండేండ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్‌లో గ్రామీణ ఓటర్లు అధికారంలో ఉన్న బీజేపీని చావుదెబ్బ తీశారు.
ఆ పార్టీ కీలక నాయకుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సైతం ఓటమిని చవిచూడటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవలసిన బాధ్యత అధికారపక్షంపై పడింది. రాష్ట్రంలోని మొత్తం 41 జిల్లాల్లో 37 జిల్లా పరిషత్‌లకు మాత్రమే ఫలితాలు వచ్చాయి. ఇందులో కేవలం ఆరు చోట్ల మాత్రమే బీజేపీ మెజారిటీని దక్కించుకుంది. మిగిలిన నాలుగు జిల్లాల్లో ఓట్ల లెక్కింపు వచ్చే నెలలో జరుగనున్నది.
బీజేపీ దిగ్గజాలకు ఎదురుదెబ్బ
రాష్ట్ర మంత్రి జబర్సింగ్ ఖర్రా భార్య, ఇద్దరు కుమారులతోసహా నలుగురు కుటుంబ సభ్యులు శ్రీమాదోపూర్ పంచాయతీ సమితి ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు. క్యాబినెట్ మంత్రులు రాజవర్ధన్ రాథోడ్, జోరారామ్ కుమావత్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమి చెందింది. ఆర్ఎల్పీకి బలమైన పట్టున్న నాగౌర్‌లో ఆ పార్టీ తన సత్తాను చాటుకుంది. ఈ ఫలితాలు బీజేపీకి తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ ఫలితాలు అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకత్వ పాలనాతీరుపై ప్రజల తీర్పును స్పష్టంగా సూచిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

