సంక్షోభంలో పాడి పరిశ్రమ
రాష్ర్టాన్ని పాల కొరత వెంటాడుతున్నది. పెరుగుతున్న దాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం, ప్రస్తుత కరువు పరిస్థితులకు తోడూ ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహం లేక ఈ రంగం నుంచి పాడి రైతులు తప్పుకొంటున్నారు.
- డిమాండ్ 30 లక్షల లీటర్లు.. ఉత్పత్తి 3 లక్షలే
- పక్క రాష్ర్టాల నుంచి 27లక్షల లీటర్ల దిగుమతి
- కరువుతో తీవ్రమైన గ్రాసం కొరత
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టాన్ని పాల కొరత వెంటాడుతున్నది. పెరుగుతున్న దాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం, ప్రస్తుత కరువు పరిస్థితులకు తోడూ ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహం లేక ఈ రంగం నుంచి పాడి రైతులు తప్పుకొంటున్నారు. పాల ఉత్పత్తి, వినియోగంలో రాష్ట్రం దేశంలో 13వ స్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల పాల దిగుబడి గణనీయంగా తగ్గి, సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఒక వ్యక్తికి రోజుకు సగటున 422 గ్రాముల పాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ సగటు 444 గ్రాముల కంటే ఇది కొంత తక్కువగా ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అవసరాలకు రోజుకు 30 లక్షల లీటర్ల పాలు కావాల్సి ఉండగా, ఉత్పత్తి సరిగా లేనందున పొరుగు రాష్ర్టాల నుంచి సుమారు 27 లక్షల లీటర్ల పాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది.
తగ్గిన విజయ డెయిరీ పాల సేకరణ
పశువుల దాణా ధరలు మూడు రెట్లు పెరుగడం, నీటి కొరత వల్ల గతంలో రోజుకు 10 లీటర్ల పాలు ఇచ్చే బర్రెలు ఇప్పుడు 5 లీటర్లకు పరిమితమయ్యాయి. దీనివల్ల విజయ డెయిరీ పాల సేకరణ రోజుకు 4 లక్షల నుంచి 3 లక్షల లీటర్లకు పడిపోయింది. పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగడంతో ఇటీవల విజయ డెయిరీ పాల ధరలను లీటర్‌కు రూ.2 చొప్పున పెంచింది. మరోవైపు పాడి రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 1,525 పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తగ్గుతున్న పాడి పశువుల సంతతి
రాష్ట్రంలో ఐదేండ్లుగా పాడి పశువుల సంతతి క్రమంగా తగ్గుతున్నది. ఆవులు 30.70 లక్షలు, బర్రెలు 30.52 లక్షలు, మేకలు 45.49 లక్షలు ఉన్నట్టు పశువైద్యాధికారులు తెలిపారు. పాడితో 1శాతం మాత్రమే ఉపాధి పొందుతున్నట్టు గుర్తించారు. ఈ ఏడాది వానకాలంలో సరైన వర్షాలు లేక పంటల సాగు తగ్గింది. వరి, మక్కజొన్న, సోయావంటి పంటల సాగు దాదాపు 20 శాతం వరకు తగ్గింది. దీంతో ఎండుగడ్డి సమస్య తలెత్తింది. పశుగ్రాసం ధరలు భారీగా పెరిగాయి. ట్రాక్టర్ ఎండుగడ్డి రూ.5వేల వరకు పెరిగింది. ప్రభుత్వం ఈ ఏడాది గుర్తించిన 365 కరువు ప్రభావిత మండలాల్లో 40 లక్షల పాడి పశువులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పాధి హామీ కింద పశుగ్రాసం పెంచాలని సర్కార్ ప్రణాళికలు రూపొందించినా ఆచరణలోకి రాలేదని రైతులు వాపోతున్నారు.
దాణా ఖర్చులు భరించలేకపోతున్నాం : శ్రీధర్‌రెడ్డి, పాడి రైతు, రంగారెడ్డి జిల్లా
మార్కెట్లో పాలకు డిమాండ్ ఉన్నా పశువుల్లో దిగుబడి సామర్థ్యం తగ్గింది. ఒక్కో పశువుకు గడ్డి, దాణా కోసం రోజుకు రూ.300 ఖర్చు అవుతున్నది. బర్రె ఉదయం, సాయంత్రం 3 లీటర్ల పాలు ఇస్తుంది. దాణా కిలో రూ.20 నుంచి రూ. 60కి పెరిగింది. ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో అని దిగులుగా ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

