తెలంగాణ హకులను కాలరాస్తే ఉద్యమం
కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయత్నించడం అన్యాయమని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హకులను హరించాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
- సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి
రామగిరి, నవంబర్ 21: కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయత్నించడం అన్యాయమని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హకులను హరించాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణకు అన్యాయం జరిగితే సీపీఎం, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని స్పష్టంచేశారు. శనివారం నల్లగొండలోని సీపీఎం జిల్లా కార్యాలయం దొడ్డి కొమరయ్య భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, మోదీ ప్రభుత్వం కార్మిక, కర్షక, సామాన్య ప్రజల ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవడానికి రైతులు, కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ, వ్యవసాయ విధానాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) చట్టబద్ధంగా అమలు చేసేందుకు పార్లమెంటులో చట్టం చేయాలని, వ్యవసాయ రంగంలో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, ఎల్ నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి తగిన పరిహారం అందించి ఆదుకోవాలని, రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని తీర్మాణాలు చేశామన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

