పెన్షన్లు పెంచకపోగా 1,029 మందికి కోత : కౌశిక్‌రెడ్డి
రేవంత్ సర్కార్ పెన్షన్ల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. తన నియోజకవర్గంలో కొత్తగా ఒక పెన్షన్ కూడా ఎక్కువగా మంజూరు చేయకపోగా, 1,029 మందిని తొలగించారని మండిపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్ పెన్షన్ల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. తన నియోజకవర్గంలో కొత్తగా ఒక పెన్షన్ కూడా ఎక్కువగా మంజూరు చేయకపోగా, 1,029 మందిని తొలగించారని మండిపడ్డారు. గతంలో 5,250 మందికి పింఛన్లు అందగా, ప్రస్తుతం 4,221 మందికే అందుతున్నాయని తెలిపారు.
తన ఆరోపణలను తప్పని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దళితబంధు కింద ట్రాక్టర్, జేసీబీ వంటి వాహనాలు కొనుగోలు చేశారనే కారణంతో లబ్ధిదారులకు పెన్షన్లు నిరాకరించడం అన్యాయమని మండిపడ్డారు. దళితబంధు లబ్ధి పొందినప్పటికీ ఇతర అర్హతలు ఉన్న వారికి ఇందిరమ్మ పెన్షన్లతోపాటు వర్తించే అన్ని పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట సభ కారణంగా చనిపోయిన సారవ్వ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాకు బదులుగా రూ.కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. దమ్ముంటే ముందు కొడంగల్‌లో పట్నం నరేందర్రెడ్డిపై గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి కంటే కనీసం ఒక ఇంచ్ ఎకువ అభివృద్ధి అయినా కొడంగల్‌లో చేశావా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి భాష చూసి జనం ఛీదరించుకుంటున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

