ఉద్యమంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర కీలకం: స్పీకర్
తెలంగాణ ఉద్యమం సమయంలో అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, తల్లుల కన్నీళ్లు నేటి తరానికి గుర్తుండటానికి ఫొటో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గుర్తుచేశారు.
రవీంద్రభారతి, నవంబర్ 21: తెలంగాణ ఉద్యమం సమయంలో అమరవీరుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, తల్లుల కన్నీళ్లు నేటి తరానికి గుర్తుండటానికి ఫొటో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గుర్తుచేశారు. తెలంగాణ ఫొటో జర్నలిస్ట్సు అసోసియేషన్ (టీఎస్‌పీజేఏ)ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఫొటో జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవం టీఎస్‌పీజేఏ అధ్యక్షుడు ఏ గంగాధర్ అధ్యక్షతన శనివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్(సురవరం ప్రతాపరెడ్డి హాల్)లో నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఖాజావిరాహత్అలీ, ప్రధాన కార్యదర్శి నారాయణ హాజరై ఉత్తమ ఫొటోజర్నలిస్టులకు అవార్డులు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. ఫొటో జర్నలిస్టులు కేవలం చిత్రాలు మాత్రమే బంధించేవారు కాదని.. చరిత్రను కండ్లకు కట్టే సాక్షులని తెలిపారు. ఒక వార్తను వందల పదాలతో వివరించవచ్చునని, కానీ ఒక ఫొటో క్షణాల్లో వేల భావాలను ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లగలదని పేర్కొన్నారు. ఫొటో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

