వరంగల్ సూపర్ స్పెషాలిటీ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా!
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని ప్రారంభించిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్ నిర్మాణ పనులు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని ప్రారంభించిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్ నిర్మాణ పనులు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. దీంతో గత దసరా పండుగ సందర్భంగా ప్రారంభించాలని భావించిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా పడింది. దసరానాడు ప్రారంభోత్సవం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆయా విభాగాలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కానీ, ఉన్న పళంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది.
దవాఖాన పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో ప్రారంభోత్సవం విషయంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. కాగా, టిమ్స్-అల్వాల్ను ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి పరిశీలించిన సందర్భంలో 95% పనులు పూర్తయ్యాయని చెప్పారు. తాజాగా ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో జూన్ 2 కల్లా వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌లను పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో 95% పనులు పూర్తయిన అల్వాల్ టిమ్స్ ప్రారంభోత్సవానికి సైతం ఆరు నెలలు ఆగాల్సిన పరిస్థితి నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

