Rajnath Singh | పాకిస్థాన్‌తో పీవోకేపైన మినహా మరే అంశంపై చర్చలుండవు : రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh | రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పాకిస్థాన్ (Pakistan) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీవోకే (POK) పైన మినహా పాకిస్థాన్‌తో భవిష్యత్తులో మరే అంశంపైన చర్చలు ఉండవని అన్నారు. భారత్ ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, స్పేస్ మిషన్ల వైపు అడుగులు వేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం చొరబాటు మార్గాలను వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. మనం డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. వాళ్లు ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు.
Rajnath Singh : రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పాకిస్థాన్ (Pakistan) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీవోకే (POK) పైన మినహా పాకిస్థాన్‌తో భవిష్యత్తులో మరే అంశంపైన చర్చలు ఉండవని అన్నారు. భారత్ ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, స్పేస్ మిషన్ల వైపు అడుగులు వేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం చొరబాటు మార్గాలను వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. మనం డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. వాళ్లు ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు.
పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే అది పీవోకే కోసమే తప్ప మరే విషయంలోనూ జరగబోవని పేర్కొన్నారు. పీవోకేను పాక్ అక్రమంగా ఆక్రమించుకుందని మండిపడ్డారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకొని యుద్ధ స్మారక చిహ్నం వద్ద మాట్లాడుతూ కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 1999లో కార్గిల్ యుద్ధంలో దేశం సాధించిన విజయాన్ని భారతమాత కిరీటంలో పొదిగిన వజ్రంగా అభివర్ణించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తమ దేశ విధానంలో ఒక భాగంగా మార్చుకుందని రాజ్‌నాథ్ సింగ్ దుయ్యబట్టారు.
ఉగ్రవాదులను అడ్డు పెట్టుకొని భారత్‌ను బెదిరించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచమంతా చూసిందన్నారు. పాక్ చేసే ఏ దుస్సాహస చర్యకైనా వారి ఊహకందని రీతిలో మన సైన్యం ప్రతిస్పందిస్తుందన్నారు. ఉరి సెక్టార్ దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్ సిందూర్.. ఇలా ఉగ్రవాద చర్యలపై భారత్ తీవ్రంగా స్పందించిందని గుర్తుచేశారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇతర ఆర్మీ అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

