అహ్మదాబాద్: ఒక బాలికకు ఒక వ్యక్తితో సంబంధం ఏర్పడింది. ఆమె కుటుంబ సభ్యులు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో తండ్రి అడ్డు తొలగించుకునేందుకు ఆ బాలిక ప్లాన్ వేసింది. ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది. గాఢ నిద్రలో ఉండగా ప్రియుడితో చంపించింది. (Girl Kills Father With Lover) గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల రంజిత్ గజేంద్రభాయ్ వాఘేలా, 17 ఏళ్ల బాలిక మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. ఆమె తండ్రి షానా చావ్డా దీనిని వ్యతిరేకించాడు.
కాగా, ఈ ఏడాది జులైలో ఆ బాలిక, రంజిత్ కలిసి ఇంటి నుంచి పారిపోయారు. కుమార్తె ప్రియుడిపై ఆమె తండ్రి షానా చావ్డా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంజిత్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆగస్ట్‌లో అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.
మరోవైపు తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తండ్రిని అంతం చేయాలని ఆ బాలిక, ప్రియుడు రంజిత్ కలిసి ప్లాన్ వేశారు. డిసెంబర్ 16న తన తల్లిదండ్రుల ఆహారంలో ఆమె నిద్ర మాత్రలు కలిపింది. అయితే తండ్రిపై హత్యా ప్రయత్నం విఫలమైంది.
డిసెంబర్ 18న ఆ యువతి మరోసారి తల్లిదండ్రుల ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. తండ్రి అపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత ప్రియుడు రంజిత్, అతడి స్నేహితుడు భవ్య మహేష్‌భాయ్ ఆ గదిలోకి ప్రవేశించారు. షానా చావ్డాను పలుమార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. మరో గదిలో నిద్రిస్తున్న తల్లితో కలిసి ఉన్న ఆ బాలిక కిటికీ నుంచి ఇది చూసింది. తన తండ్రి అడ్డుతొలగిపోయినట్లు నిర్ధారించుకున్నది.
కాగా, ఆ బాలిక తండ్రి షానా చావ్డా రాత్రి వేళ వేరే గదిలో నిద్రించేవాడు. భార్య, కుమార్తె నిద్రించే గదికి లోపల నుంచి గడియ పెట్టేవాడు. ఈ నేపథ్యంలో ఆయనను ఎవరు హత్య చేశారన్నది పోలీసులకు తొలుత అంతుపట్టలేదు.
అయితే ప్రియుడితో ప్రేమ సంబంధం కారణంగా కుమార్తే హత్య చేయించినట్లు దర్యాప్తులో తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. రంజిత్, అతడి స్నేహితుడు మహేష్భాయ్ను అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను అదుపులోకి తీసుకుని పిల్లల సంరక్షణ గృహానికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Watch: హోంగార్డ్ సెలక్షన్స్‌కు 8,000 మందికిపైగా హాజరు.. ఏకంగా రన్‌వేపై పరీక్ష
Watch: మహిళను ఢీకొట్టిన ఆటో.. తర్వాత ఏం జరిగిందంటే?