Bellamkonda Sreenivas | సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న యువ హీరో.. అమ్మాయి ఎవరు, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
Bellamkonda Sreenivas | ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకున్నారు. తాను ప్రేమించిన కావ్యా రెడ్డితో ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, సన్నిహితులు సమక్షంలో ఈ కార్యక్రమం సాదాసీదాగా జరిగింది.ఈ నిశ్చితార్థ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన కొద్దిమంది ప్రముఖులు హాజరయ్యారు
Bellamkonda Sreenivas | ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకున్నారు. తాను ప్రేమించిన కావ్యా రెడ్డితో ఆయన ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, సన్నిహితులు సమక్షంలో ఈ కార్యక్రమం సాదాసీదాగా జరిగింది.ఈ నిశ్చితార్థ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన కొద్దిమంది ప్రముఖులు హాజరయ్యారు. హీరోయిన్ సంయుక్త మీనన్, దర్శకుడు బోయపాటి శ్రీను సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.
కావ్యా రెడ్డి హైదరాబాద్‌కు చెందిన యువతి. ఆమెకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. ఆమె కుటుంబం న్యాయ వృత్తితో అనుబంధం కలిగి ఉంది. కావ్యా రెడ్డి తాత జడ్జిగా పనిచేయగా, ఆమె తండ్రి ప్రస్తుతం లాయర్‌గా సేవలందిస్తున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందన్న విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే పెళ్లి తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక, కవచం, సీత, రాక్షసుడు వంటి యాక్షన్ మరియు లవ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించారు. గత ఏడాది విడుదలైన భైరవం, కిష్కింధపురి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు.
ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ‘హైందవ’లో నటిస్తున్నారు. అలాగే లోకమాన్య దర్శకత్వంలో ‘రామమ్’ సినిమాలోనూ నటిస్తున్నారు. ఇదే కాకుండా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టైసన్ నాయుడు’ చిత్రంలో కూడా హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేకు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దవుతుందా!
Bellamkonda Sreenivas | ‘హైందవ’కు అదిరిపోయే బిజినెస్.. విడుదలకు ముందే రూ.32 కోట్లు,నిర్మాతలకు భారీ ఊరట!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన గొడవలు.. సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం, తనను తాను కొట్టుకున్న నీతూ!
Donald Trump | ఓటమితో ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’!.. అమెరికా వలస విధానంపై సంచలన వ్యాఖ్యలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

