సిమ్లా: ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో రోగి, డాక్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ముదరడంతో వారి మధ్య ఫైట్‌కు దారి తీసింది. ఈ నేపథ్యంలో బెడ్‌పై ఉన్న రోగిపై డాక్టర్ పిడిగుద్దులు కురిపించాడు. (Doctor, Patient Exchange Kicks, Punches) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం అర్జున్ పన్వర్ అనే వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. దీంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు వెళ్లాడు. బ్రోంకో స్కోపీ పరీక్ష తర్వాత ఒక వార్డులోని బెడ్‌పై అతడు పడుకున్నాడు.
కాగా, ఆ వార్డులోకి వచ్చిన డాక్టర్‌తో శ్వాస తీసుకోలేకపోతున్నట్లు అర్జున్ తెలిపాడు. ఆక్సిజన్ అందించాలని కోరాడు. దీంతో అతడి అడ్మిషన్ గురించి ఆ డాక్టర్ దురుసుగా ప్రశ్నించాడు. అయితే గౌరవంగా మాట్లాడాలని అర్జున్ అనడంతో ఆ డాక్టర్ ఆగ్రహించాడు. బెడ్‌పై ఉన్న రోగితో ఘర్షణ పడ్డాడు. అతడిపై పంచ్‌లు కురిపించాడు. డాక్టర్ దాడిని ప్రతిఘటించేందుకు అర్జున్ ప్రయత్నించాడు.
మరోవైపు డాక్టర్, రోగి మధ్య జరిగిన ఈ కోట్లాటకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అర్జున్ కుటుంబ సభ్యులు, బంధువులు స్థానికులతో కలిసి ఆ హాస్పిటల్ వద్ద నిరసన తెలిపారు. రోగిపై దాడి చేసిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ డాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావ్ స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు.
IGMC शिमला का ये वीडियो बिस्तर पर लेटा हुआ व्यक्ति एंडोस्कोपी करवाने अस्पताल आया था।
बात कुछ भी हुई हो इस तरह का व्यवहार किसी डॉक्टर द्वारा निंदनीय है, डॉक्टर भगवान का रूप है पर इस तरह के कुछ लोग इस प्रोफेशन पर सवालिया निशान खड़े करते है
अगर बात हाथापाई तक आई है तो इसके कारण… pic.twitter.com/IWYWHLp0Ob
— Gems of Himachal (@GemsHimachal) December 22, 2025
Also Read:
Watch: హోంగార్డ్ సెలక్షన్స్‌కు 8,000 మందికిపైగా హాజరు.. ఏకంగా రన్‌వేపై పరీక్ష
Watch: మహిళను ఢీకొట్టిన ఆటో.. తర్వాత ఏం జరిగిందంటే?
Girl Kills Father With Lover | తండ్రికి నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడితో చంపించిన బాలిక